ట్రంప్ పై ట్విటర్ బ్యాన్, ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలను మేల్కొలిపే పిలుపు మాత్రమే. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ట్విటర్ శాశ్వతంగా బ్యాన్  చేయడంపై స్పందించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, అక్రమ బడా కంపెనీల వల్ల తలెత్తుతున్న ముప్పుపై ప్రజాస్వామ్య...

  • Publish Date - 12:56 pm, Sat, 9 January 21 Edited By: Anil kumar poka
ట్రంప్ పై ట్విటర్ బ్యాన్, ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థలను మేల్కొలిపే పిలుపు మాత్రమే. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని ట్విటర్ శాశ్వతంగా బ్యాన్  చేయడంపై స్పందించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య, అక్రమ బడా కంపెనీల వల్ల తలెత్తుతున్న ముప్పుపై ప్రజాస్వామ్య వ్యవస్థలను మేల్కొలిపే పిలుపుగా దీన్ని పరిగణించాలన్నారు. ఈ సంస్థల వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఉద్దేశించిన  చట్టాలను సమీక్షించడానికి గల అవకాశంగా దీని భావించాలన్నారు. ఇండియాలో కూడా ఈ విధమైన చర్యలకు ఆస్కారం ఉంటుందన్నారు. ట్రంప్ ను పర్మనెంట్ గా నిషేధిస్తూ ట్విటర్ పెట్టిన  పోస్టును తేజస్వి సూర్య ప్రస్తావిస్తూ ..మన దేశంలో పెద్ద టెక్ సంస్థల కారణంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు కలుగుతున్న ప్రమాదాన్ని గ్రహించలేని వారికందరికి ఇదొక వేకప్ కాల్ అని అభివర్ణించారు.  ట్రంప్ సొంత సాధనమైన ‘పోటస్’ పట్లే  ట్విటర్ ఇలా వ్యవహరించిందంటే ఎవరిపైనైనా ఈ సాధనం  ఈ విధమైన చర్య తీసుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

అందువల్ల సాధ్యమైనంత త్వరగా ఇండియా తన చట్టాలను సమీక్షించుకుంటే బాగుంటుందని తేజస్వి సూర్య సూచించారు.