హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహా రాజా రవితేజ. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ధమాకా సినిమాతో హిట్ అందుకున్న రవితేజ ఆతర్వాత వచ్చిన రావణాసుర సినిమాతో మరో ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా సుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రవితేజ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు మూవీ టీమ్. ఇటీవలే బాలీవుడ్ లోనూ రవితేజ సందడి చేశారు. అక్కడి మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా రవితేజ పై యశ్ ఫాన్స్ గరం అవుతున్నారు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ.. తన కో స్టార్స్ గురించి తెలిపాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ అంటే ఇష్టమని, ప్రభాస్ డార్లింగ్ అని, రాజమౌళిలో విజన్ అంటే తనకు చాలా ఇష్టమని రవితేజ చెప్పాడు. అలాగే కన్నడ హీరో యశ్ గురించి అడిగితే అతని సినిమాల్లో కేజీఎఫ్ సినిమా ఒక్కటే చూశా.. ఆ సినిమా చేయడం అతని చాలా లక్కీ అని అన్నాడు. దాంతో యశ్ ఫ్యాన్స్ రవితేజ పై సీరియస్ అవుతున్నారు. నిజానికి రవితేజ చెప్పిందాంట్లో తప్పు లేకపోయినా యశ్ ఫాన్స్ మాత్రం దాన్ని ఇలా నెగిటివ్ గా అర్ధం చేసుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కేజీఎఫ్ సినిమాతోనే యశ్ తెలుసు. అదే విషయాన్నీ చెప్పాడు రవితేజ. కానీ యశ్ ఫ్యాన్స్ మాత్రం తప్పుగా అర్ధం చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.