పాలు ఆరోగ్యానికి నాలుగు విధాలా మంచిది. అందులో ఎటువంటి సందేహం లేదు. పాలల్లో అధిక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకలకు, పళ్ల ధృడత్వానికి అవసరమైన కాల్షియం పాలల్లో పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండటానికి రోజూ పాల తాగమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే పాలల్లో సాధారణంగా మనకు రెండు రకాల పాలు కనిపిస్తాయి. ఒకటి గేదె పాలు, మరొకటి ఆవు పాలు. ఈ రెండు రకాల పాలను తాగే వారు ఉన్నారు. రెండూ ఆరోగ్యానికి మంచిదనే చాలా మంది చెబుతారు. అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది? అసలు ఈ రెండింటికీ తేడా ఏంటి? రెండింటినీ ఎలా విభజించాలి? రెండింటిలో దేనిలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి? దేనిలో సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి? వంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
కొవ్వు.. పాలలో కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. ఆవు పాలతో పోల్చుకుంటే.. గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలు లో 3 నుండి 4 శాతం కొవ్వు ఉంటే గేదె పాలలో 7 నుండి 8 శాతం కొవ్వు ఉంటుంది. దీనితో గేదె పాలు జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఎక్కువ సమయం మీకు ఆకలి లేకుండా చేస్తుంది.
నీళ్లు.. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు కనుక మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఆవు పాలని ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో 90 శాతం నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్ కి గురై పోకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది.
ప్రోటీన్స్.. ఇక మనం ప్రోటీన్ల విషయానికి వస్తే.. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండటం వల్ల శిశువులు, పెద్దవాళ్ళకి గేదె పాలను ఇవ్వడం అంత మంచిది కాదు.
కొలెస్ట్రాల్.. ఇక కొలెస్ట్రాల్ విషయంలోకి వస్తే… రెండు రకాల పాలల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా వేరేగా ఉన్నాయి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనితో పీసీఓడీ, హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు, ఒబిసిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకీ మంచిది. కాబట్టి దీనిని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది.
క్యాలరీలు.. గేదె పాలలో క్యాలరీలు సమృద్దిగా ఉంటాయి ఎందుకంటే గేదె పాలలో కొవ్వుపదార్ధాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు మాత్రమే ఉంటాయి.
ప్రిజర్వేషన్.. గేదె పాలను ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడానికి వీలు అవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే గేదె పాలలో హై పెరోక్సిడైజ్ యాక్టివిటీ ఉంటుంది అంటే ఇది ఒక ఎంజైమ్ లాంటిది. అదే ఆవు పాలని ఎక్కువ కాలం ఉంచలేము. వాటిని ఒకటి లేదా రెండు రోజులలో తాగేయాలి.
రంగు.. గేదె పాలు వైట్ క్రీమ్ కలర్‌లో ఉంటే ఆవు పాలు కాస్త ఎల్లోయిష్ గా ఉంటాయి. గేదె పాలలో బీటా-కెరోటిన్ పిగ్మెంట్ రంగుని లేకుండా చేస్తుంది. ఆవు పాలలో విటమిన్ ఏ ఉండడం వల్ల కాస్త పసుపు రంగు ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..