వచ్చే రెండ్రోజులు వానలే వానలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. అతి భారీ వర్షాలకు అవకాశం

|

Nov 18, 2020 | 6:49 PM

వచ్చే రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ విభాగం. తీర ప్రాంతం వారు సముద్రంలోకి చేపల వేటకు...

వచ్చే రెండ్రోజులు వానలే వానలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. అతి భారీ వర్షాలకు అవకాశం
Follow us on

Heavy rains expected in two days: వచ్చే రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది భారత వాతావరణ విభాగం. తీర ప్రాంతం వారు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొద్దని వార్నింగిస్తున్నారు అధికారులు. తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల వారు ఎత్తైన ప్రదేశాలకు షిఫ్ట్ అవడం మంచిదంటున్నారు.

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో దక్షిణ తమిళనాడు ప్రాంతమంతా వరద బీభత్సంతో వణికిపోతోంది. నైరుతీ బంగాళాఖాతంతోపాటు ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వల్లే దక్షిణ తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తాజాగా ఆ అల్పపీడనం మరింత బలపడడంతో వచ్చే 48 గంటల పాటు దక్షిణ తమిళనాడు ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరిక జారీ చేసింది.

చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశం వుందని.. దక్షిణ తమిళనాడు జిల్లాలైన కన్యాకుమారి, తూత్తుకుడి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంటున్నారు. ఆ ప్రాంతంలోని మత్యకారులు, తమిళనాడు-కేరళ తీరప్రాంతాలలో ఉన్న మత్యకారులు చేపలవేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ALSO READ: జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ చూపు.. డిసెంబర్‌లో కీలక భేటీ

ALSO READ: తలసాని 104 అంటే కేసీఆర్ 105 అన్నారు.. బల్దియా ఫలితంపై కేసీఆర్ జోస్యం

ALSO READ: హైదరాబాద్‌లో ఎలెక్షన్ కోడ్ స్టార్ట్.. వరద సాయానికి ఈసీ బ్రేక్

ALSO READ: ఆ విషయాన్ని మైండ్‌లోంచి తీసేయ్యండి.. పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం

ALSO READ: వచ్చే ఏడు టీమిండియా బిజీ బిజీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే పండగ

ALSO READ: ఆన్‌లైన్ బెట్టింగులపై తమిళ సర్కార్ సంచలన నిర్ణయం