నగర శివారుల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం…
హైదరాబాద్ నగర శివారులను ఆకస్మికంగా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. ఉదయం నుంచి మండుటెండలతో జనం ఇళ్లల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోతుండగా.. సాయంత్ర వేళలో వరుణుడు ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనాన్ని కలిగించాడు. నగర శివారుల్లోని ఈసీఐఎల్, జవహర్ నగర్, దమ్మాయిగూడ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు.. శామీర్ పేట వైపు కూడా పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పలుచోట్ల చెట్లు నేలకొరిగిపోయాయి. ఇక ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.