Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

| Edited By: Venkata Narayana

Dec 04, 2020 | 9:53 PM

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఫలితాల్లో నైతిక బాధ్యతను వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు.

Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం..  టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..
Uttam-Kumar-Reddy
Follow us on

GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ కార్యాలయానికి పంపించారు. ఇక ఫలితాలపై  సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు తీవ్ర మనస్తాపానికి గురి చేశాయని ఉత్తమ్ వాపోయారు. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 43 స్థానాల్లో గెలుపొందింది. ఇంకా 6 స్థానాల్లో ఆధిక్యంలో కనబరుస్తోంది. అలాగే ఎంఐఎం 42 స్థానాల్లో, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..