Telangana: పైనుంచి చూస్తే చింతపండు లోడే.. లోపల చెక్ చేస్తే స్టన్..

తగ్గేదే లేదు అంటున్నారు కేటుగాళ్లు. పుష్ప రేంజ్ మాస్టర్ స్కెచ్చులు వేస్తున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో.. తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఓ గ్యాంగ్ హన్మకొండ పోలీసులకు చిక్కింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Telangana: పైనుంచి చూస్తే చింతపండు లోడే.. లోపల చెక్ చేస్తే స్టన్..
Tamarind (Representative image)
Follow us

|

Updated on: May 06, 2024 | 7:54 AM

ఏం హుషారు ఉన్నార్రా మీరు. క్రైమ్ చేయడానికి కూడా క్రియేటివిటీ. పోలీసులను బురిడీ కొట్టించేందుకు మాస్టర్ స్కెచ్. పుష్ప రేంజ్‌ ఐడియా. అయినా కానీ చిక్కారు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నారు. చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణాకు యత్నించిన నలుగురు వ్యక్తులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో వారు ఈ పనికి పూనుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఆంధ్రాలోని NTR జిల్లా.. పొన్నవరానికి చెందిన ఈదర కృష్ణ, అనుముల వెంకటరమణలుగా గుర్తించారు.

సీలేరుకు చెందిన సురేశ్‌‌‌‌ అనే వ్యక్తి వద్ద నిందితులు గంజాయి కొనుగోలు చేశారు. దీనిని హన్మకొండ జిల్లా శాయంపేటకు చెందిన అబ్దుల్‌‌‌‌ రహీం, మధ్యప్రదేశ్‌‌‌‌కు చెందిన మైనర్‌‌కు ఇచ్చేందుకు చింతపండు, యూరియా బస్తాల మాటున గంజాయిని పెట్టి బస్సులో హన్మకొండ తీసుకొచ్చారు. బస్టాండ్‌‌‌‌లో వీరు అనుమానాస్పదంగా సంచరించడంతో..  కొందరు గమనించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్సై శ్రవణ్‌‌‌‌కుమార్‌‌‌‌ సిబ్బందితో వెళ్లి.. వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌‌‌‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2.35 లక్షల విలువైన 9.5 కేజీల గంజాయిని సీజ్ చేశారు. సీలేరుకు చెందిన సురేశ్‌‌‌‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా గంజాయి వినియోగం ఇప్పుడు విసృతంగా పెరగడం.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజూ పోలీసుల తనిఖీల్లో ఇబ్బడి ముబ్బడిగా గంజాయి దొరకుతోంది. ఒకసారి పోలీసులకు దొరికినవాళ్లు కూడా జైలుకు వెళ్లి వచ్చి.. ఇదే తంతుకు పూనుకుంటున్నారు. ఈ గంజాయి ముప్పు నుంచి యువతను రక్షించాలంటే.. పోలీసులు సెపరేట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం