Hyderabad: మీరు రోడ్లపక్కన టీ తాగుతున్నారా..? ఈ విషయం తెలుసుకోండి

|

Jul 05, 2024 | 1:33 PM

మంచి ఫుడ్ తీసుకుంటే మనిషికి బలం, ఆయుష్షు పెరుగుతాయి. కానీ ఇప్పుడు తినడానికి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతోంది? ఏది తిందామన్నా, ఏది తాగుదామన్నా కల్తీనే. ముఖ్యంగా నగరాల్లో అయితే పరిస్థితి మరింత ఆధ్వానంగా ఉంది.

Hyderabad: మీరు రోడ్లపక్కన టీ తాగుతున్నారా..? ఈ విషయం తెలుసుకోండి
Roadside Tea
Follow us on

తాగే టీ నుంచి తినే తిండి వరకు అన్నీ కల్తీ.. మొన్నటివరకు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేసిన అధికారులు తాజాగా వీధి దుకాణలపై ఫోకస్‌ పెట్టారు. హైటెక్‌ సిటీలోని రోడ్‌ సైడ్‌ షాపుల్లో జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ బృందం, టీవీ9 సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నమ్మలేని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీ పొడిలో క్యాన్సర్‌కు కారణమయ్యే కలర్లు వాడుతున్నట్లు దాడుల్లో బయటపడింది. స్ట్రీట్‌ ఫుడ్‌ షాపుల్లో వాడే మసాలాలు, సాస్‌లు అన్నింటిలో ప్రమాదకరమైన కలర్స్‌ వాడుతున్నట్లు తేలింది. FSSAI మొబైల్‌ ల్యాబ్‌ ద్వారా అక్కడికక్కడే పరిశీలించి..ఆహార పదార్ధాల్లో కల్తీ జరిగినట్లు నిర్ధారించారు అధికారులు.

ప్రజల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అపరిశుభ్ర వాతావరణం, కల్తీ పదార్థాలతో సొమ్ము వెనకేసుకునేందుకు తెగిస్తున్నారు వ్యాపారులు. ఇక కలర్స్‌ కలిపిన ఆహార పదార్థాలతో ఆరోగ్యానికి మరింత ముప్పు తప్పదని వినియోగదారులు కలవరపడుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని.. నాసిరకం ఆహార పదార్థాలపై నిత్యం నిఘా ఉంటుందని వ్యాపారులను ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..