Health: ఇవి తింటే కొవ్వును కోసి బయటకు తీసినట్లే.. మంచు కరిగినట్లు కరగాల్సిందే

ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ పెరిగిపోయాయి. అప్పటివరకు బానే ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంపై శ్రద్ద ఇప్పుడు అత్యంత అవసరం. ముఖ్యంగా.. హార్ట్ హెల్త్‌కి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Health: ఇవి తింటే కొవ్వును కోసి బయటకు తీసినట్లే.. మంచు కరిగినట్లు కరగాల్సిందే
Flax Seeds Laddu
Follow us

|

Updated on: Apr 19, 2024 | 5:48 PM

కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ద పెరిగింది. చాలామంది జంక్ ఫుడ్ తినడం లేదు. డైలీ తినే ఫుడ్‌లో విటమిన్లు, పోషకాలు ఉండేలా చూసుకుంటున్నారు. చాలామంది ఎక్సర్‌సైజ్‌లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయుర్వేం, ప్రకృతి వైద్యానికి సంబందించిన టిప్స్ బాగా ఫాలో అవుతున్నారు. మంతెన సత్యనారాయణ రాజు వీడియోలను జనం బాగా వీక్షిస్తున్నారు. ఖర్చు లేకుండా..  వంటింటి చిట్కాలతోనే ఆయన చెప్పే.. ఆరోగ్యపు అలవాట్లు అందరికీ నచ్చుతున్నాయి. హార్ట్ అటాక్స్‌కు ప్రధాన కారణం… రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ చాలా ప్రమాదకరమైనది. ముఖ్యంగా గుండెలో, బ్రెయిన్‌లో ఇలా కొవ్వు చేరితే గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి  కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ మంతెన గారు ఓ టిప్ చెప్పారు.

రక్తనాళ్లలో కొలెస్ట్రాల్ పేరుకోకుండా కాపాడేది ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్. అవిసె గింజుల్లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ధారాలంగా ఉంటుంది. అవిసె గింజుల్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనే గుడ్ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఇది మన బాడీకి ఎంతో మేలు చేస్తోంది. దాదాపు 27 పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 30 రోజులపాటు రోజూ 25 నుంచి 30 గ్రాములు అవిసె గింజల్ని తింటే..  బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకావం నెల రోజుల్లోనే 15 శాతం తగ్గిందని పరిశోధనల ద్వారా నిరూపితమైంది. అంతేకాదు గుండె సంబంధిత జబ్బులు వచ్చి స్టంట్స్, బైపాస్ ఆపరేషన్స్ చేయించుకున్నవారు.. లేదా బ్లాక్స్ ఉన్నవారు కూడా ఈ అవిసె గింజల్ని రోజుకు 25 గ్రాములు తీసుకుంటే.. ఫ్యూచర్‌లో వారికి గుండెజబ్బులు తిరగబెట్టే ప్రమాదం ఉండదని ప్రకృతి వైద్యులు మంతెన చెబుతున్నారు.

ఇలా అయితే రుచిగా…

తొలుత అవిసె గింజల్ని దోరగా వేయించి.. పక్కన పెట్టుకోవాలి. ఆపై సీడ్స్ తీసిన చిన్న, చిన్న ఖర్జూరం ముక్కలను తీస్కోని.. దానిలో కొంత హనీ వేసి.. పోయిపై పెట్టి 2 నిమిషాలు వేడి చేయాలి. ఆపై వేపిన అవిసె గింజల్ని అందులో కలిపి.. లడ్డూలుగా చేసుకోవాలి. అలా రోజు ఒక అవిసె లడ్డూ తింటే ఆరోగ్యం మీ చెంతే.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.