Eluru Mystery Disease: ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి.. ఇతర అనారోగ్య సమస్యలే కారణమంటున్న వైద్యులు..

|

Dec 10, 2020 | 11:26 AM

ఏలూరు వాసుల్లో గుబులు రేపుతున్న వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులను...

Eluru Mystery Disease: ఏలూరు బాధితుల్లో మరో ఇద్దరు మృతి.. ఇతర అనారోగ్య సమస్యలే కారణమంటున్న  వైద్యులు..
Follow us on

Eluru Mystery Disease: ఏలూరు వాసుల్లో గుబులు రేపుతున్న వింత వ్యాధి బాధితుల్లో మరో ఇద్దరు మరణించారు. ఈ వ్యాధి కారణంగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్న రోగులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం 30 మందిని తరలించగా.. వారిలో సుబ్బరావమ్మ(56), అప్పారావు(50) బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే సుబ్బరావమ్మ కరోనాతో, అప్పారావు టీబీతో బాధపడుతున్నారని.. వాటి వల్లే చనిపోయారని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. కాగా, ఆదివారం రాత్రి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో మైనేని శ్రీధర్‌(45) మరణించిన విషయం విదితమే.

ఇదిలా ఉంటే వింత వ్యాధి బారినపడ్డ బాధితుల సంఖ్య 592కి చేరింది. ఇప్పటివరకు 511 మంది రోగులను డిశ్చార్జ్‌ చేయగా.. ప్రస్తుతం 46 మంది ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో 33 మంది గుంటూరు, విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.

Also Read:

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. రిజర్వేషన్ ఉన్నవారికే అనుమతి..

గ్రామ వాలంటీర్ల తొలిగింపు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.? వివరణ ఇచ్చిన సచివాలయ శాఖ కమిషనర్.!

ఏలూరు మిస్టరీ డిసీజ్.. చికిత్సపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆళ్ళ నాని కీలక ప్రకటన..

ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ.. పింక్ బాల్ టెస్టుకు వైదొలిగిన డేవిడ్ వార్నర్..