హుండీ ఆదాయం.. శ్రీవారి సమాచారం

దేవదేవుడు తిరుమల శ్రీవారి నిన్నటి(ఆదివారం) హుండీ ఆదాయం రూ. 2.37 కోట్లు వచ్చింది. మొత్తంగా శ్రీవారిని 19,174 మంది భక్తులు దర్శించుకున్నారు. 5,935 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, కలియుగ వైకుంఠవాసునికి చెన్నైకి చెందిన భాష్యం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తరపున, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఉత్సవాల […]

హుండీ ఆదాయం.. శ్రీవారి సమాచారం


దేవదేవుడు తిరుమల శ్రీవారి నిన్నటి(ఆదివారం) హుండీ ఆదాయం రూ. 2.37 కోట్లు వచ్చింది. మొత్తంగా శ్రీవారిని 19,174 మంది భక్తులు దర్శించుకున్నారు. 5,935 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, కలియుగ వైకుంఠవాసునికి చెన్నైకి చెందిన భాష్యం కన్‌స్ట్రక్షన్స్ సంస్థ తరపున, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్ రూ.35.89 లక్షల విలువైన బంగారు శఠారిని కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కానుకను శ్రీవారి ఆలయంలో టీటీడీ ఏఈఓ ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీవారి ఉత్సవాల ఊరేగింపు సందర్భంలో ఈ శఠారిని వినియోగించనున్నారు.