జోరు చూపిస్తోన్న వార్నర్.. ప్రభుదేవా స్టెప్‌లతో రచ్చ..

|

May 17, 2020 | 6:19 PM

ఐ యామ్‌ క్రికెటర్ ఆల్‌సో టిక్ టాకర్ ఆల్‌సో.. అని అంటూ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ వేళ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాడు.

జోరు చూపిస్తోన్న వార్నర్.. ప్రభుదేవా స్టెప్‌లతో రచ్చ..
Follow us on

ఐ యామ్‌ క్రికెటర్ ఆల్‌సో టిక్ టాకర్ ఆల్‌సో.. అని అంటూ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్ డౌన్ వేళ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాడు. ఇప్పటివరకు ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ, పవర్ ఫుల్ డైలాగ్స్‌కి యాక్టింగ్ చేస్తూ అలరించిన వార్నర్.. లేటెస్ట్‌గా ప్రభుదేవా హిట్ సాంగ్ ‘ముక్కాల ముక్కాబుల’కు భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. స్ట్రీట్ డాన్సర్ హిందీ సినిమా కోసం ఈ సాంగ్‌ను రీమిక్స్ చేయగా.. ఆ పాటకు వార్నర్ స్టెప్‌లు వేసి అలరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, గతంలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురం’ సినిమా నుంచి ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాములా’ పాటలకు వార్నర్ తన ఫ్యామిలీతో స్టెపులు వేసి అలరించాడు. అంతేకాకుండా మహేష్ బాబు ‘పోకిరి’, ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాల నుంచి డైలాగులతో కూడా ఈ డాషింగ్ క్రికెటర్ రచ్చ చేశాడు. ఏది ఏమైనా కరోనా కారణంగా ఇంటికి పరిమితమైన వార్నర్ తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పాలి.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!

పాక్‌లో కరోనా టైమింగ్ పెట్టుకుని తిరుగుతుందట..