Coronavirus Scare: కరోనా భయం.. వేలాది కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..

|

Mar 12, 2020 | 1:59 PM

Coronavirus Scare: చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 4 వేల మంది మృతి చెందగా.. లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 62 కేసులు నమోదయ్యాయి. అటు భారత్ పౌల్ట్రీ రైతులపై కూడా దీని ప్రభావం భారీగానే పడిందని చెప్పాలి. చికెన్ తింటే కరోనా వస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తుండటంతో చికెన్ సేల్స్ పూర్తిగా […]

Coronavirus Scare: కరోనా భయం.. వేలాది కోళ్లు సజీవ సమాధి.. వీడియో వైరల్..
Follow us on

Coronavirus Scare: చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలన్నింటిని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 4 వేల మంది మృతి చెందగా.. లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే 62 కేసులు నమోదయ్యాయి. అటు భారత్ పౌల్ట్రీ రైతులపై కూడా దీని ప్రభావం భారీగానే పడిందని చెప్పాలి.

చికెన్ తింటే కరోనా వస్తుందంటూ పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తుండటంతో చికెన్ సేల్స్ పూర్తిగా డౌన్ అయిపోయాయి. దీనితో పౌల్ట్రీ రైతులు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన ఓ రైతు కరోనా భయంతో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

కర్ణాటకలోని గోకక్ తాలూకా లోలాసూర్ గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ అనే రైతు కరోనా వైరస్ వదంతులు కారణంగా చికెన్ సేల్స్ పడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై దాదాపు ఆరు వేల కోళ్లను గుంత తవ్వి సజీవంగా పూడ్చి పెట్టాడు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చికెన్ ధర కేజి రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముడవుతోందన్నాడు. ఇక తాను కోళ్లను పెంచడానికి రూ. 6 లక్షలు ఖర్చయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటిని నిర్వహించాలంటే తనకు ఖచ్చితంగా నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, అతడు కోళ్లను పూడ్చి పెట్టిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. కొందరు అతని చేసిన పనిపై మండిపడుతున్నారు.

For More News:

ఏపీ: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు…

కరోనా భయం.. కేంద్రం సంచలన నిర్ణయం.. ఏప్రిల్ 15 వరకు అన్ని వీసాలు రద్దు..

సఫారీ సిరీస్.. టీమిండియాకు ఆ ముగ్గురే కీలకం…

‘వకీల్ సాబ్’లో గోవా బ్యూటీ..?

పొలిటికల్ ఎంట్రీపై తలైవా క్లారిటీ.. 60 నుంచి 65 శాతం సీట్లు యువతకే…

మధ్యతరగతి ప్రజలకు షాక్.. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేట్లు తగ్గింపు.?

ఐపీఎల్ 2020 తాత్కాలికంగా రద్దు..?

రూ.60 లక్షల లాటరీ గెలిచాడు.. అంతలోనే షాక్ తగిలింది..