కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?

|

Mar 27, 2020 | 9:38 AM

Coronavirus Effect: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడమే కాకుండా.. ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేశాయి. అటు అత్యవసర సేవలు మినహాయించి మొత్తం ప్రజా రవాణా అంతా బంద్ అయింది. ఇదిలా ఉంటే నిత్యావసర వస్తువులు కొనేందుకు తప్పితే ప్రజలు రోడ్లు మీదకు రావాలని అది కూడా గుంపులుగా గుమ్మకూడవద్దని సూచించాయి. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనేందుకు ఇంటికి […]

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?
Follow us on

Coronavirus Effect: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడమే కాకుండా.. ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రావద్దని విజ్ఞప్తి చేశాయి. అటు అత్యవసర సేవలు మినహాయించి మొత్తం ప్రజా రవాణా అంతా బంద్ అయింది. ఇదిలా ఉంటే నిత్యావసర వస్తువులు కొనేందుకు తప్పితే ప్రజలు రోడ్లు మీదకు రావాలని అది కూడా గుంపులుగా గుమ్మకూడవద్దని సూచించాయి. ఇక కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనేందుకు ఇంటికి ఒకరు చొప్పున రావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక ఏపీలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో మెడికల్ షాపులు 24 గంటలు ఓపెన్ ఉండగా.. నిత్యావసర వస్తువులు దొరికే దుకాణాలు, కూరగాయల మార్కెట్, పండ్ల షాపులు మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే తెరిచి ఉంటాయని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసులు 11 నమోదు కాగా.. తెలంగాణలో ఆ సంఖ్య 45కు చేరింది.

For More News:

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?

కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా..

కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?

కరోనా విలయం.. స్విట్జర్లాండ్‌కు ఫెదరర్ భారీ సాయం..

దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?