ఫోన్ వినియోగదారులకు షాక్.. మొబైల్ స్క్రీన్‌తో కరోనా వైరస్.!

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఇతర దేశాలకు వేగంగా

ఫోన్ వినియోగదారులకు షాక్.. మొబైల్ స్క్రీన్‌తో కరోనా వైరస్.!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 10:17 PM

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. ఇతర దేశాలకు వేగంగా వ్యాపిస్తూ గడగడలాడిస్తోంది. భారత్‌లోనూ 30 పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గరవుతున్నారు. ఇతరు తుమ్ములు, దగ్గు తుంపర్ల నుంచి కాపాడుకునేందుకు ముఖాలకు మాస్క్‌లు వేసుకుంటున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా జంకుతున్నారు. ఐతే కేవలం ఇవి పాటిస్తే సరిపోదు.. మొబైల్ ఫోన్లతో జాగ్రతగా ఉండాలంటున్నారు శాస్త్రవేత్తలు.

కాగా.. మొబైల్ స్క్రీన్‌లతో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి చాలా ప్రమాదకరమని.. మొబైల్ తెరలపై కరోనా వైరస్‌లు సుమారు వారం రోజుల పాటు జీవిస్తాయని హెచ్చరిస్తున్నారు. మొబైల్ హ్యాండ్ సెట్స్, హ్యాండిల్స్ వంటి ధృడ ఉపరితతాలపై కరోనా వైరస్ ఎక్కువ కాలం జీవిస్తుందని తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తికి ఇవి వారధులుగా మారే అవకాశముందని ప్రజలకు వార్నింగ్ ఇస్తున్నారు.

మరోవైపు.. సాధారణంగా దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుంది. అలా బయటకొచ్చే కరోనా వైరస్ మొబైల్ స్క్రీన్‌లపైకి చేరితే అక్కడే వారం రోజుల పాటు తిష్ట వేస్తాయి. ప్రయోగశాలల్లో బ్యాక్టీరియా, వైరస్‌ను పెంచేందుకు ఉపయోగించే పెట్రీ ప్లేట్స్‌ మాదిరిగా మొబైల్ స్క్రీన్స్ పనిచేస్తాయి. అందుకే మొబైల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్లను ఆల్కాహాల్ వైప్స్‌తో ప్రతి రోజు రెండు సార్లు శుభ్రం చేయాలని సూచిస్తున్నారు.