AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంకో ఐదేళ్లు కావాలా?.. యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ ఫైర్

యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పనులు, యాదాద్రి అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు కావాలా ? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం యాదాద్రి ఆలయ నిర్మాణం పనులతో పాటు పట్టణంలోని […]

ఇంకో ఐదేళ్లు కావాలా?.. యాదాద్రి పనులపై సీఎం కేసీఆర్ ఫైర్
CM KCR In yadadri
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2019 | 9:06 PM

Share

యాదాద్రి ఆలయం పునర్ నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పనులు, యాదాద్రి అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేయడానికి మరో ఐదేళ్లు కావాలా ? అంటూ వారిపై అసహనం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత తొందరగా పనులను పూర్తి చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం యాదాద్రి ఆలయ నిర్మాణం పనులతో పాటు పట్టణంలోని అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించిన సీఎం కేసీఆర్… పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఆలయ అభివృద్ధికి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని యాదాద్రి అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ నిర్మాణ పనుల కోసం తక్షణమే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు.  మరోవైపు.. యాడాకు మరో ఉన్నతాధికారిని నియమించాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్‌ అండ్‌ బీ పనులకు సంబంధించి ఎస్‌ఈ స్థాయి వ్యక్తి పర్యవేక్షిస్తున్నారు. అధికారుల కోరిక మేరకు త్వరలోనే సీఈ స్థాయి వ్యక్తిని ఉన్నతాధికారిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.

ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
ఆ ఎనర్జీ ఏంట్రా.. పూజానే డామినేట్ చేసిన చిన్నోడు..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!