మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసే వారు రెచ్చపోతూనే ఉంటారు.. ఇది అక్షరాల నిజం..ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు..ప్రస్తుతం ఈ మోసాల చిట్టాలో రోజుకో కొత్త రకం చిటింగ్ కేసు నమోదవుతుంది. చివరకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల పేరిట కూడా కొందరు కంత్రీగాళ్లు డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మనుషుల భావోద్వేగాలను సైతం క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి వార్తల నేపథ్యంలో ఒక మనిషికి ఎదుటి మనిషిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. క్యాన్సర్ పేరటి కోట్లు వసూలు చేసిన ఓ వ్యక్తి ఆ డబ్బుతో దర్జాగా జల్సాలు చేయటం సర్వత్రా విమర్శలకు దారి తీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాలో, లాన్ అనే 29 ఏళ్ల వ్యక్తి సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ను పెట్టాడు. అందులో తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు పేర్కొన్నాడు. అతనికి చికిత్స కోసం 900,000 యువాన్లు (దాదాపు రూ. 1.5 కోట్లు) కావాలి. ఈ మొత్తాన్ని సమకూర్చలేకపోతే, తాను ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు బతకాలనే ఆశ ఉందంటూ, దాతల సాయం కోరుతూ వేడుకున్నాడు. తోచిన సహాయం కోసం ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. అదే ప్రతి రోజూ హెడ్‌లైన్స్‌గా మారింది. చివరకు లాన్‌పై సానుభూతితో దాతల నుంచి విరాళం వెల్లువల వచ్చింది. కానీ కొంతకాలం తర్వాత అతని నిజ స్వరూపం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అయితే ఒక రోజు లాన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులో అతను తన కొత్తగా కొనుగోలు చేసిన ఫ్లాట్‌ఫోటోలను షేర్ చేశాడు. అతను తన స్వంత డబ్బుతో ఈ ఇంటిని కొన్నానని పేర్కొన్నాడు. ఈ పోస్ట్ తన ఫాలోవర్లను షాక్‌కి గురిచేసింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం తన ప్రాణాలను కాపాడుకోవడానికి సహాయం చేయమని వేడుకున్న వ్యక్తి హఠాత్తుగా కోట్ల విలువైన ఫ్లాట్‌ను ఎలా కొనుగోలు చేస్తాడంటూ అందరూ షాక్‌కు గురయ్యారు. దాంతో అతనిపై అనుమానం వ్యక్తం చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే అతని గురించి ఆరా తీయగా తనకు క్యాన్సర్ అనే మాటలు నాటకమని తేలింది. ఫండ్ రైజింగ్ ప్లాట్‌ఫామ్ సహాయంతో అతను ఇప్పటికే 700,000 యువాన్‌లను (సుమారు రూ. 81 లక్షల 64 వేలు) సేకరించినట్లు వెల్లడైంది. లన్ చేసిన పనికి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది అతనిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దాంతో చైనా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం లాన్‌పై చర్య తీసుకుంది. కొత్త ఫ్లాట్ కొనుగోలుకు వినియోగించిన డబ్బు తనదేనని అతడు నిరూపించుకోలేకపోయాడు. అంతిమంగా అతపి కఠినమైన చర్య తీసుకున్నట్టుగా తెలిసింది.
లాన్‌ను సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫార్‌ల నుండి శాశ్వతంగా నిషేధించారు. తద్వారా అతను భవిష్యత్తులో అలాంటి కార్యకలాపాలలో పాల్గొనలేడు. కాగా, ఈ కేసులో లాన్ ఏదైనా చట్టపరమైన శిక్షను ఎదుర్కొన్నాడా అనేది స్పష్టంగా తెలియదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..