యూఏఈలో ఐపీఎల్ 2020.. రంగం సిద్దం చేస్తోన్న ఫ్రాంచైజీలు.!

|

Jul 18, 2020 | 3:36 PM

IPL franchises begin preparations for UAE: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ నిర్వహణపై సందిగ్దం ఏర్పడగా.. తాజాగా బీసీసీఐ సెప్టెంబర్ విండోలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. అయితే ఆ సమయంలో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఉండగా.. అది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఐసీసీ స్పష్టత కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. అయితే ఫ్రాంచైజీలు […]

యూఏఈలో ఐపీఎల్ 2020.. రంగం సిద్దం చేస్తోన్న ఫ్రాంచైజీలు.!
Follow us on

IPL franchises begin preparations for UAE: క్రికెట్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. సెప్టెంబర్‌లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ నిర్వహణపై సందిగ్దం ఏర్పడగా.. తాజాగా బీసీసీఐ సెప్టెంబర్ విండోలో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతోంది. అయితే ఆ సమయంలో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ఉండగా.. అది వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఐసీసీ స్పష్టత కోసం బీసీసీఐ వేచి చూస్తోంది. అయితే ఫ్రాంచైజీలు మాత్రం యూఏఈలో లీగ్ ఆడేందుకు అప్పుడే రంగం సిద్దం చేస్తున్నారు.

‘ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు ఛార్టర్డ్ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్, ట్రైనింగ్ క్యాంప్‌‌‌‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఫ్రాంచైజీలు చేస్తున్నట్లు ఓ టీమ్ ఫ్రాంచైజీ అఫీషియల్ జాతీయ మీడియాకు వెల్లడించారు. అటు ఐసోలేషన్ పీరియడ్, భద్రతా నిబంధనలు వంటి వాటిపై కూడా దృష్టి సారిస్తున్నారట. ఆగష్టు‌‌ మూడో వారం నుంచి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారం మధ్యలో దుబాయ్‌‌‌‌ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఆటగాళ్లకు ట్రెయినింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఉండనుంది. 30 నుంచి 35 మంది టాప్‌‌‌‌ క్రికెటర్లు ఇందులో పాల్గొననుండగా.. ట్రయినింగ్ క్యాంప్‌‌‌‌ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు. ఫ్రాంచైజీలు సిద్ధమైన తర్వాత సెప్టెంబర్‌‌‌‌ 26 నుంచి నవంబర్‌‌‌‌ 8 వరకు ఐపీఎల్‌‌‌‌ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ పక్కా షెడ్యూల్‌ను కూడా ప్లాన్ చేస్తోంది.

Also Read:

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..

హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!

సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!

సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..