ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..

|

Sep 24, 2020 | 5:40 PM

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్. బస్సుల సీటింగ్ విధానంలో మార్పులు జరిగాయి. ఇకపై బస్సుల్లో తొలుత సీటుకు ఒకరు చొప్పున కూర్చునేందుకు అనుమతించి..

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..
Follow us on

ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్. బస్సుల సీటింగ్ విధానంలో మార్పులు జరిగాయి. ఇకపై బస్సుల్లో తొలుత సీటుకు ఒకరు చొప్పున కూర్చునేందుకు అనుమతించి.. అన్ని సీట్లు నిండిన తర్వాత పక్కన మరొకరు కూర్చునేందుకు అనుమతించనున్నారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా బస్సుల్లో నిలబడి ప్రయాణించడానికి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రయాణీకులు ప్రతీ ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. అలాగే బస్ స్టేషన్లలోని అన్ని స్టాళ్లలో మాస్క్‌లు విక్రయిస్తారని తెలిపారు. అటు కండక్టర్లకు, డ్రైవర్లకు నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు ఇచ్చిందన్నారు. కాగా, కరోనా వల్ల ఇప్పటివరకు 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో బస్సులు తిప్పిన ఏపీఎస్ఆర్టీసీ.. ఇకపై పూర్తిస్థాయి సీటింగ్ సామర్ధ్యంతో బస్సు సర్వీసులను నడపాలని నిర్ణయించింది. (APSRTC)

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..