ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, ఆయన సోదరి ప్రియాంక గాంధీకి బీహార్ సీఎం నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడు, జేడీ-యు ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించినందుకు థ్యాంక్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. సీఏఎపై పార్లమెంటులో ఓటింగ్ జరిగినప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యు దీన్ని సమర్థించిన విషయం గమనార్హం. అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో అయోమయాన్ని రేపింది. రాష్ట్రంలో సీఏఎని అమలు చేస్తారా లేదా అన్న విషయమై ప్రజలు కూడా గందరగోళానికి గురవుతున్నారు. అటు-ఎన్నార్సీపై నితీష్ ప్రభుత్వం మౌనం వహించింది. ఈ నెల 10 నుంచి కొత్త చట్టం అమలులోకి వస్తుందని రెండు రోజుల క్రితమే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అటు-పీకే చేసిన ప్రకటన.. ‘హిందుత్వ’ విధానంపై కాంగ్రెస్ పాటిస్తున్న వైఖరిని జేడీ-యు కూడా సమర్థిస్తోందా అన్న అనుమానాలను కలిగించేదిగా ఉందంటున్నారు.ఇదిలా ఉండగా.. ఎన్నార్సీ, సీఏఎ లను వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
I join my voice with all to thank #Congress leadership for their formal and unequivocal rejection of #CAA_NRC. Both @rahulgandhi & @priyankagandhi deserves special thanks for their efforts on this count.
Also would like to reassure to all – बिहार में CAA-NRC लागू नहीं होगा।
— Prashant Kishor (@PrashantKishor) January 12, 2020