పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ దూకుడు.. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ విడుదల

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఊపుమీదున్న రాష్ట్ర నాయకత్వం.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ దూకుడు.. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ విడుదల
Follow us

|

Updated on: Dec 28, 2020 | 12:40 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ పార్టీ దూకుడు పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఊపుమీదున్న రాష్ట్ర నాయకత్వం.. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తును పూర్తి చేసింది. రెండు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా ఇద్దరు అభ్యర్థులను ఖరారు చేసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, వరంగల్‌-నల్లగొండ-ఖమ్మం సెగ్మెంటు నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డిల పేర్లను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసినట్లు సమాచారం. వీరి పేర్లను జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ నివేదించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలావుంటే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు ప్రక్రియలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. ఏ పార్టీ ఎక్కువ ఓటర్లను చేర్చుకుంటుందో.. ఎక్కువగా ఓటర్ల నమోదులో భాగస్వామ్యం అవుతుందో.. ఆ పార్టీ అభ్యర్థికి ఎక్కువగా మద్ధతు లభించడం సాధారణం. గత ఎన్నికల సమయంలో ఓటరు నమోదు ప్రక్రియను బీజేపీ చాలా క్రియాశీలకంగా వినియోగించుకుంది. ఈసారి కూడా అదే ఊపుతో కొత్త ఓటర్లను నమోది చేయించింది. ఇందుకోసం ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఓటర్ల సంఖ్య పెంచుకునేలా ఫ్లాన్ చేసింది.

గతంలో ఎన్నికలప్పుడు గోడల మీద రాతలు, పోస్టర్లు, కరపత్రాలు ప్రత్యక్షమయ్యేవి. తర్వాతి కాలంలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, కటౌట్లు, ఎన్నికల వాగ్దానాలతో కూడిన బ్రోచర్లవంటివి వాడేవారు. ఇప్పుడు ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా హవా కొనసాగుతుందిద. క్షణాల్లో వేలాది మందికి గ్రూపుల ద్వారా పోస్టులు చేరుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో భారతీయ జనతాపార్టీ ఓ అడుగు ముందుకేసి ప్రత్యేకించి మొబైల్ యాప్‌ను రూపొందించింది. రెండు సెగ్మెంట్లలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నకలకు సంబంధించి వివరాలతో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఎమ్మెల్సీ ఎన్నికల హామీలతోపాటు పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు వెల్లడించనున్నారు. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో పొందుపర్చనున్నట్లు సమాచారం.

Latest Articles
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పిఠాపురంలో ఎన్నికల ప్రచారం.. క్యాంపెయింగ్‎లో జగన్ కొత్త ట్రెండ్..
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
పరశురాముడి గండ్రగొడ్డలి పాతిన ప్రదేశం తంగినాథ్ ధామ్ ఎక్కడ ఉందంటే
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
నేటితో ముగియనున్న ప్రచారం.. పార్టీలు, అభ్యర్థులకు ఈసీ కీలక సూచనలు
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
17 ఏళ్ల తర్వాత పసికూనపై ఓడిన పాకిస్తాన్..
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
బాబాయ్ కోసం రంగంలోకి అబ్బాయ్.. పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
ముంబైతో ఢీ కొట్టేందుకు కోల్‌కతా రెడీ.. గెలిస్తే ప్లే ఆఫ్స్ పక్కా
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
కుప్పం నీదా.. నాదా.. చంద్రబాబు గెలుపుపై టీడీపీలో టెన్షన్..
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
చార్‌ధామ్ యాత్రకి IRCTC స్పెషల్ ప్యాకేజీ 12 రోజుల టూర్‌డీటైల్స్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
మారిపోయిన స్నేహా ఉల్లాల్.. కొత్త ఫోటో వైరల్
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
అదా శర్మ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!