కాకుల మృతితో అలజడి.. వైరస్ వ్యాప్తి పట్ల కేంద్రం హెచ్చరికలు.. ఆయా రాష్ట్రాల్లో హై-అలెర్ట్..

Bird Flu Virus: రాజస్థాన్‌లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కలకలం మొదలైంది. జాలావఢ్ జిల్లాలో భారీ సంఖ్య పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి...

కాకుల మృతితో అలజడి.. వైరస్ వ్యాప్తి పట్ల కేంద్రం హెచ్చరికలు.. ఆయా రాష్ట్రాల్లో హై-అలెర్ట్..
Follow us

|

Updated on: Jan 03, 2021 | 3:57 PM

Bird Flu Virus: రాజస్థాన్‌లో ఏవియన్ ఫ్లూ(బర్డ్ ఫ్లూ) కలకలం మొదలైంది. జాలావఢ్ జిల్లాలో భారీ సంఖ్య పక్షులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి.గడిచిన వారం రోజులుగా వందల సంఖ్యలో చనిపోతున్న కాకులు, నెమళ్లు శాంపిళ్లు పరీక్షించగా.. వాటిల్లో హెచ్5ఎన్8 ఏవియన్ ఇన్‌ఫ్ల్యూ‌యెంజా(బర్డ్ ఫ్లూ) లక్షణాలు కనిపించినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ డిసీజెస్ పరిశోధకులు వెల్లడించారు. ఈ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదముందని హెచ్చరికలు జారీ చేశారు. దీనితో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌల్ట్రీ పరిశ్రమకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ హై-అలెర్ట్ జారీ చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే పలు ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించింది.

కాగా, మధ్యప్రదేశ్‌లో కూడా బర్డ్ ఫ్లూ విస్తరించింది. మూడో రోజుల క్రితం ఇండోర్‌లోని డెలీ కాలేజీ వద్ద సుమారు 96 కాకులు మృతి చెందాయి. ఇక వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఈ టైప్ గల వైరస్ ఎంతో ప్రమాదకరమని.. పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. అటు ఝూలావాద్‌లో 16 కాకులు, పన్వార్‌లో 10, సునేల్‌లో 8 కాకులు బర్డ్ ఫ్లూ వల్ల మృతి చెందినట్లు గుర్తించారు. దీనితో ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రోటోకాల్‌ను మధ్యప్రదేశ్‌ అధికారులు అమలులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆ ప్రాంతాల్లో జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి.. వారి శాంపిళ్లను టెస్టుకు పంపించనున్నారు.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..