Chicken Deaths: తెలుగు రాష్ట్రాల్లో మృత్యువాత పడుతున్న నాటుకోళ్లు..బర్డ్ ప్లూ నేపథ్యంలో ఆందోళనలో పెంపకందారులు

| Edited By: Ravi Kiran

Jan 08, 2021 | 3:10 PM

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో నాటుకోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ఖమ్మం, వరంగల్, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వందల సంఖ్యలో...

Chicken Deaths: తెలుగు రాష్ట్రాల్లో మృత్యువాత పడుతున్న నాటుకోళ్లు..బర్డ్ ప్లూ నేపథ్యంలో ఆందోళనలో పెంపకందారులు
Follow us on

Sudden Chicken Death : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో నాటుకోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ఖమ్మం, వరంగల్, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వందల సంఖ్యలో నాటుకోళ్లు మృతి చెందాయి. బర్డ్ ప్లూ నేపథ్యంలో కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్లు మరణించిన తర్వాత ముక్కులోంచి ఒక రకమైన ద్రవం కారడం, కొన్ని కోళ్లకు చర్మంపై బోడిపెలుగా వచ్చి చర్మం రాలిపోవడం వంటివి జరుగుతున్నాయని బాధితులు చెబుతున్నారు.

మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను పశుసంవర్ధక శాఖ అధికారులు  ల్యాబ్‌కు పంపారు. ఇప్పటివరకు కరోనా, స్ట్రెయిన్‌తో అల్లాడిపోయిన జనాలకు ఇప్పుడు బర్డ్ ప్లూ ఆందోళన కలిగిస్తుంది. బర్డ్ ప్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉందని కేంద్రం రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. వలస పక్షులు కారణంగా ఈ బర్డ్ ప్లూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు చెబతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వాలు అప్రమత్తమై.. సత్వర చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

Also Read :

APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే !

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు