బడ్జెట్‌పై బయోకాన్‌ చీఫ్‌ ఇంట్రస్టింగ్ ట్వీట్..

కేంద్రంలో రెండోసారి కూడా తిరుగులేని అధిక్యంతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరసగా రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..అరుదైన ఘనత సొంత చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి..పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతులను చదివి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ  పారిశ్రామిక వేత్త, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ ముజుందార్‌ షా నూతన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్‌తో పోలుస్తూ.. […]

బడ్జెట్‌పై బయోకాన్‌ చీఫ్‌ ఇంట్రస్టింగ్ ట్వీట్..
Follow us

|

Updated on: Feb 01, 2020 | 12:43 PM

కేంద్రంలో రెండోసారి కూడా తిరుగులేని అధిక్యంతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు 2020-21 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరసగా రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ..అరుదైన ఘనత సొంత చేసుకున్నారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి..పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతులను చదివి వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ  పారిశ్రామిక వేత్త, బయోకాన్‌ చీఫ్‌ కిరణ్‌ ముజుందార్‌ షా నూతన బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను క్యాన్సర్‌తో పోలుస్తూ.. ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

మన ఆర్థిక క్యాన్సర్‌కు కీమోథెరపీ కాకుండా, ఇమ్యూనోథెరపీ కావాలని పేర్కొన్నారు. అయిన గాయాల గురించి కాకుండా..వాటి కారకాలు గురించి ఆలోచించాలని తెలిపారు. బడ్జెట్‌ 2020 అటువంటి విధానాన్నే కలిగి ఉంటుదన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆమె..సంపద సృష్టి అనేది  మన ఆర్థిక నిరోధక వ్యవ్యస్థలో  కీలకమైన అంశమని అభిప్రాయపడ్డారు. ఆర్థిక క్యాన్సర్‌పై ద్రవ్య విధానం విపరీతమైన ప్రభావం చూపుతుందని తెలిపాడు. ఆరోగ్యం, విద్య మౌలిక వసతులు తదితర అంశాలు ఇమ్యూనోథెరపీలో టీ సెల్స్‌ వంటివని  కిరణ్‌ ముజుందార్‌ షా ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు.