మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘క్రాక్’ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ ఉన్న ఒక్క పాటను త్వరలో చిత్రీకరించనున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం ‘భూమ్ బద్దల్’ లిరికల్ వీడియో సాంగ్‌ను నేడు విడుదల చేసింది. రవితేజ, అప్సరా రాణిపై ఐటమ్ నంబర్‌గా దీన్ని చిత్రీకరించారు.
అంచనాలకు తగ్గట్లుగా ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ అప్పీలింగ్ సాంగ్‌ను అందించారు. మంచి రిథమ్‌తో జోరుగా సాగే లైన్లతో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, మాస్ బీట్స్‌కు తగ్గట్లు సింగర్స్ సింహా, మంగ్లీ హుషారుగా, మంచి ఎనర్జీతో ఈ పాటను ఆలపించారు.టెర్రిఫిక్ డాన్సర్ అయిన రవితేజ విజిల్స్ వేసే విధంగా డాన్స్ చేయగా, అప్సరా రాణి అందాలు కనువిందు చేసే రీతిలో ఉన్నాయి. ఈ పాటకు జాని మాస్టర్ సూపర్బ్ కొరియోగ్రఫీ చేశారు.
శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తీర్చిదిద్దుతున్నారు. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించే అంశాలు ఈ మూవీలో ఉంటాయి. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ‘క్రాక్’ చిత్రానికి తమన్ సంగీతం ఎస్సెట్ కానున్నది. మరి మాస్ రాజా ఈ సారి క్రాక్ మూవీతోొ ఎటువంటి ఇంఫాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read :
ఆ ఇద్దరు లెజెండ్‌లు కలిస్తే రోహిత్.. ముంబై సారథిపై ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం
తెలంగాణ : గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ, గవర్నర్ కోటాలో మరో ఇద్దరి పేర్లు ఖరారు !
అదిరి రేంజ్‌లో ‘ఆహా’ వారి దీపావళి సంబరాలు, ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
‘ఆహా’ గేమ్ ఛేంజర్, మున్ముందు మరింత గొప్ప కంటెంట్‌తో మీ ముందుకు వస్తాం : రాము జూపల్లి