AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office Monthly Scheme: ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన రాబడినిచ్చే పోస్టాఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువ. దీంతో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భద్రత కావాలని ప్రతి ఒక్కరూ...

Post Office Monthly Scheme: ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన రాబడినిచ్చే పోస్టాఫీస్‌లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్..
Post Office Deposit Scheme
Surya Kala
|

Updated on: Jan 20, 2021 | 6:17 PM

Share

Post Office Monthly Scheme:ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారే ఎక్కువ. దీంతో ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భద్రత కావాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. దీంతో చేతిలో డబ్బులున్నప్పుడు వాటిని ఎక్కడైనా పెట్టుబడిగా పెట్టాలని ఆలోచిస్తారు. తమ ఇన్వెస్ట్‌మెంట్‌కు తగిన రాబడి రావాలని కోరుకుంటారు. అలాంటి వారికోసమే పోస్టాఫీస్‌లో ఒక మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇక్కడ డబ్బులు పెట్టినా ఎటువంటి రిస్క్ లేకుండా రాబడి పొందొచ్చు. పోస్టాఫీస్ పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. వీటిల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి ఉంది. ఈ స్కీమ్ గురించి వివరాలను తెలుసుకుందాం..!

పోస్టాఫీస్ మంత్లీ స్కీమ్‌లో చేరితే ప్రతి నెలా డబ్బులు వస్తాయి. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు. ఈ పధకంలో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వెయ్యి రూపాయలు పెట్టడం వల్ల పెద్దగా లాభం ఉండదు. కానీ ఒక్కసారిగా మనం పెట్టిన మొత్తాన్ని తీసుకోవచ్చు. అయితే ఈ స్కీమ్‌లో ఎవరైనా గరిష్టంగా రూ.4.50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ అయితే రూ. 9,00,000 కూడా డిపాజిట్ చేసే వీలుంది. ఒకేసారి డబ్బులు పెట్టాలి. తర్వాత ప్రతి నెలా రాబడి పొందొచ్చు. రిటైర్ అయిన ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్స్‌కు ఈ స్కీమ్ మంచి అనువుగా ఉంటుంది. ఎవరైనా, ఎ వయసు వారైనా దగ్గరలోని పోస్టాఫీస్‌కు వెళ్లి మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో చేరొచ్చు.

ఈ స్కీమ్ లో చేరడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకెళ్తే చాలు. పోస్టాఫీస్‌లో ఫామ్ నింపి ఈ డాక్యుమెంట్లు అందించి మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ తీసుకోవచ్చు. ఈ స్కీమ్ లో పెట్టిన డబ్బును ఐదేళ్ల తర్వాత వెనక్కి తీసుకోవచ్చు. అంతవరకు ఆ పెట్టుబడికి నెలనెలా వడ్డీ వస్తుంది. ఈ పధకంలో డబ్బు పెట్టిన వారికి ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఉదాహరణకు ఎవరైనా మంత్లీ స్కీమ్‌లో జాయింట్ అకౌంట్ తెరవాలని భావించి అందులో తొమ్మిది లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తే.. ఆ పెట్టుబడికి వడ్డీగా ఏడాదికి రూ. 59,400 వస్తుంది. అంటే నెలకు వడ్డీగా సుమారు రూ. 5, 000 వస్తాయన్నమాట. సో పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు క్షేమం.. నెలనెలా ఆదాయానికి ఆదాయం లభిస్తుందన్న మాట.

Also Read: భానుడికి చిహ్నంగా భావించే ఈ రేగు పండులో ఎన్ని ఔషధ గుణాలున్నాయో తెలుసా..!

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే