ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడి షాహి జామా మసీదులో ఆదివారం ఉదయం సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులపై స్థానికులు దాడికి దిగారు. చేతికందిన రాళ్లు, చెప్పులతో అధికారులపై దాడి చేశారు. అధికారుల వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
#WATCH | Uttar Pradesh: An incident of stone pelting took place in Sambhal when a survey team reached Shahi Jama Masjid to conduct a survey of the mosque. Police used tear gas to control the situation.
Following a petition filed by senior advocate Vishnu Shanker Jain in the… pic.twitter.com/HWPRrVaN6P
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 24, 2024
కాగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని యూపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రశాంత్ కుమార్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు సంభాల్‌లో సర్వే నిర్వహిస్తున్నారని చెప్పారు. కానీ, కొందరు సంఘ వ్యతిరేకులు రాళ్లు రువ్వారని చెప్పారు. ఘటనా స్థలంలో పోలీసులు, ఉన్నతాధికారులు భారీగా మోహరించారని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు. రాళ్లదాడి చేసిన వారిని పోలీసులు గుర్తించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..