#Attack on Police లాక్ డౌన్ అంటే పోలీసుపై దాడి

దేశమంతటా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో వుండగా ఎందుకు రోడ్డుపైకి వచ్చారని అడిగిన పాపానికి ఓ పోలీసును కొందరు చితకబాదిన ఉదంతం రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

#Attack on Police లాక్ డౌన్ అంటే పోలీసుపై దాడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2020 | 2:57 PM

Two persons attacked a home guard: దేశమంతటా 21 రోజుల పాటు లాక్ డౌన్ అమల్లో వుండగా ఎందుకు రోడ్డుపైకి వచ్చారని అడిగిన పాపానికి ఓ పోలీసును కొందరు చితకబాదిన ఉదంతం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వద్ద వాహనాల రాకపోకలను నియంత్రిస్తుండగా ఈ సంఘటన జరిగింది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గ్ మండల పోలీసులు బుధవారం కొందుర్గ్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా షాద్ నగర్ నుండి పరిగి వైపు వెళ్తున్న పరిగికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంలో పోలీసులు వాహనాన్ని ఆపారు. దేశమంతా లాక్ డౌన్ ఉందని, బయటికి రావద్దని చెప్పేందుకు పోలీసులు ట్రై చేశారు. అయితే పోలీసుల మాటలతో ఆగ్రహం చెందిన వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన రామకృషారెడ్డి , రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు హోమ్ గార్డ్ వెంకటేష్ పై దాడికి దిగారు.

హోం గార్డుపై దాడికి దిగిన సందర్భంలో అక్కడే వున్న కొందరు వారి దాడిని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. వారి ఆదేశాల మేరకు హోం గార్డుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై ఐపీసీ 188, 332,సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు.