బాధ్యతలు చేపట్టిన ఏపీ కొత్త మంత్రులు..

ఏపీ కొత్త మంత్రులు బాధ్యతల స్వీకరణ కొనసాగుతోంది. ఇవాళ ముగ్గురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్‌లోని తనకు కేటాయించిన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఎన్డీబీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. […]

బాధ్యతలు చేపట్టిన ఏపీ కొత్త మంత్రులు..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2019 | 11:17 AM

ఏపీ కొత్త మంత్రులు బాధ్యతల స్వీకరణ కొనసాగుతోంది. ఇవాళ ముగ్గురు మంత్రులు బాధ్యతలు చేపట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎంపీ మిథున్‌రెడ్డితో పాటు కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్‌లోని తనకు కేటాయించిన చాంబర్లో బాధ్యతలు చేపట్టారు. ఎన్డీబీ ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్‌పై ఆయన తొలి సంతకం చేశారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

అలాగే.. అటవీశాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్ రెండో బ్లాకులోని తన చాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. వన్యపాణులకు సంబంధిచిన రెండు కమిటీలపై ఆయన తొలి సంతకం చేశారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీని పొడిగిస్తామని చెప్పారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.