సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం

రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం కోసం దాదాపు 9 వేల కోట్ల మేర నిధులు ఖ‌ర్చుపెట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ పాలనానుమతులు జారీ చేసింది.

సీమ ప్రాజెక్టులపై జ‌గ‌న్ స‌ర్కార్ కీలక నిర్ణయం
Follow us

|

Updated on: Aug 27, 2020 | 9:00 AM

రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం కోసం దాదాపు 9 వేల కోట్ల మేర నిధులు ఖ‌ర్చుపెట్టేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ పాలనానుమతులు జారీ చేసింది. కడపలోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ పంపిన ప్రతిపాదనలను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన గ‌వ‌ర్న‌మెంట్… గండికోట- చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట- పైడిపాలెం ఎత్తిపోతల పథకాల విస్తరణతో పాటు అనుసంధానానికి 3,556 కోట్ల రూపాయల పనులకు ప‌ర్మిష‌న్స్ ఇచ్చింది.

మరోవైపు గాలేరు నగరి నుంచి హంద్రినీవా అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి, అధ్యయనానికి 5,139 కోట్ల రూపాయల మేర పాలనానుమతులు ఇచ్చింది గండికోట టన్నెల్ ద్వారా అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీటిని తరలింపుకు వీలుగా కాలువ సామర్ధ్యం పెంచేందుకు 604 కోట్ల రూపాయల మేర పాలనానుమతులు జారీ చేసింది. గాలేరు నగరి కాలువకు అదనంగా మరో పదివేల క్యూసెక్కుల నీటిని తరలించేలా గండికోట అదనపు టన్నెల్ నిర్మాణం, పాత నిర్మాణాల తొలగింపుతో పాటు అధ్యయనం లాంటి పనులకు ఈ నిధులు వెచ్చించేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

ఎత్తిపోతల ప్రాజెక్టు డెవ‌ల‌ప్‌మెంట్‌ పనులకుగానూ సమగ్ర అంచనాలను రెడీ చెయ్యాల‌ని కడపలోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను గ‌వ‌ర్న‌మెంట్ ఆదేశించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చినందున్న ప్రాజెక్టులో వినియోగించే ఇసుక రేట్ల‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని జలవనరులశాఖ పేర్కొంది.

Also Read :

ప్రధానికి సీఎం జగన్ లేఖ, ఈ అంశం గురించే

ఇంట్లో నిద్ర‌పోతున్న ముగ్గురు చిన్నారుల‌ను కాటేసిన క‌ట్ల‌పాము

Latest Articles
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ