పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..

|

Nov 03, 2020 | 2:44 PM

పంటల భీమా పథకం పేరును వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకంగా మారుస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

పంటల భీమా పథకం పేరు మార్చిన జగన్ సర్కార్..
Follow us on

పంటల భీమా పథకం పేరును వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకంగా మారుస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలకు గానూ పంటల భీమా పథకానికి వైఎస్ఆర్ పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019-20 సంవత్సరంలో రబీ సీజన్, అలాగే 2020 ఖరీఫ్ పంటకు  పంటల భీమా పథకం వర్తింప చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ జనరల్ ఇన్సూరెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో ఉచిత పంటల భీమా అమలవుతోంది.

కాగా  దివంగత ముఖ్యమంత్రి, వైఎస్సార్ జయంతిని జగన్ సర్కార్ రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  ప్రతేడాది జూలై 8 రైతు దినోత్సవం జరపాలని గతంలో ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read :

భాగ్యనగరంలో జల సిరి..భారీగా పెరిగిన గ్రౌండ్ వాటర్

క్రేజీ ఆఫర్ కొట్టేసిన పూర్ణ !