కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం..!

కర్నూలు జిల్లా వాసులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని..

కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభోత్సవం..!

Updated on: Dec 10, 2020 | 7:59 AM

Orvakallu Airport: కర్నూలు జిల్లా వాసులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. ఓర్వకల్లు విమానాశ్రయం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రాష్ట్రంలోని సివిల్ ఏవియేషన్ పెండింగ్ పనులపై ఆయన చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్.. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయం కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉందని తెలిపారు.

దానికి సంబంధించిన అనుమతులపై కేంద్రమంత్రితో మాట్లాడానని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టు షిఫ్టింగ్ పనులు, టెక్నికల్ అంశాలపై కూడా చర్చించామన్నారు. అన్ని అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్  వివరించారు. కాగా, తొందరలోనే భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కూడా జరుగుతుందని పేర్కొన్నారు.

Also Read:

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. నేటి నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం.. రిజర్వేషన్ ఉన్నవారికే అనుమతి..

గ్రామ వాలంటీర్ల తొలిగింపు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం.? వివరణ ఇచ్చిన సచివాలయ శాఖ కమిషనర్.!

ఏలూరు మిస్టరీ డిసీజ్.. చికిత్సపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆళ్ళ నాని కీలక ప్రకటన..

ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ.. పింక్ బాల్ టెస్టుకు వైదొలిగిన డేవిడ్ వార్నర్..

Loading...
Unable to load recommendations.
Follow Us