AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 338 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి

|

Dec 31, 2020 | 6:15 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 61,148 కరోనా టెస్టులు చేయగా..338 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన..

AP Corona Cases : రాష్ట్రంలో కొత్తగా 338 వైరస్ పాజిటివ్ కేసులు..యాక్టీవ్ కేసులు, మరణాల వివరాలు ఇలా ఉన్నాయి
AP-Corona
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా 61,148 కరోనా టెస్టులు చేయగా..338 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,82,286కి చేరినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. కొత్తగా కరోనా కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,108కి చేరింది. గడిచిన 24 గంటల్లో 328 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కాగా మొత్తం రికవరీల సంఖ్య 8,71,916కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,262 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,18,25,566 కరోనా నమూనాలను పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వివరించింది.

పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.

 

Also Read :

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !