#YSRZeroInterestScheme: ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం’ ప్రారంభం.. వారి ఖాతాల్లోకి డబ్బులు జమ..!

|

Nov 17, 2020 | 8:36 PM

'వైఎస్సార్ సున్నా వడ్డీ' పధకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు..

#YSRZeroInterestScheme: వైఎస్సార్ సున్నా వడ్డీ పధకం ప్రారంభం.. వారి ఖాతాల్లోకి డబ్బులు జమ..!
Follow us on

YSR Zero Interest Scheme: ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పధకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు ఈ పధకం కింద పూర్తి వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసింది. 2019 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతులకు సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాగే అక్టోబర్ నెలలో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన 1,97,525 వ్యవసాయ, ఉద్యానవన  రైతుల ఖాతాల్లో రూ.132 కోట్ల పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)ని జమ చేశారు.

రైతులకు ఎంత చేసినా తక్కువేనని సీఎం జగన్ అన్నారు. ఇవాళ రైతులకు చేస్తున్న ఈ కార్యక్రమం..  రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని తెలిపారు. రుణాలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వం వడ్డీ కడుతుందన్న నమ్మకం వారికి కలుగుతుందన్నారు. గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా.. రైతులకు మరింత సాయం చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

Also Read:

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ మరో ముందడుగు.. ఆ జోన్ల పరిధిలోనే..!

ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాల ప్రజలకు అలెర్ట్..!

ఏపీ రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి వడ్డీ రాయితీ సొమ్ము జమ.!