విద్యార్థులకు సీఎం జగన్ బంపరాఫర్.. ‘అమ్మఒడి’ డబ్బులు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌లు…

Amma Vodi Scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'అమ్మఒడి' పధకం రెండో విడతను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో...

  • Ravi Kiran
  • Publish Date - 2:25 pm, Mon, 11 January 21
విద్యార్థులకు సీఎం జగన్ బంపరాఫర్.. 'అమ్మఒడి' డబ్బులు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌లు...

Amma Vodi Scheme: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘అమ్మఒడి’ పధకం రెండో విడతను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యార్ధులు తమ కంప్యూటర్ స్కిల్స్‌ పెంచుకునేందుకు సీఎం ల్యాప్‌టాప్ ఆఫర్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి విద్యార్ధులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ ఇస్తామని స్పష్టం చేశారు. 4 జీబీ ర్యామ్‌, 500 జీబీ హార్డ్‌డిస్క్‌, విండోస్ 10 ఓఎస్‌ ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్‌ ఉంటుందన్నారు. మూడేళ్ల వారంటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను విద్యార్థులకు అందిస్తామన్నారు.

అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపిస్తే రూ.15 వేలు సాయం అందించామని, వరుసగా రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. అమ్మఒడి రెండో విడత ద్వారా రూ.6,673 కోట్లు అందిస్తున్నామని, నేరుగా తల్లుల ఖాతాల్లోనే డబ్బు జమ చేస్తున్నామని చెప్పారు. ఫలితంగా అదనంగా 4 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని చెప్పుకొచ్చారు. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు అందజేస్తున్నామని, గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్‌ చెప్పారు.