శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథానికి అంకురార్పణ

|

Sep 27, 2020 | 2:12 PM

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ క్రతువుకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఇవాళ ఉ.11:15 గంటలకు ఆలయ మర్యాదలు, భక్తిప్రపత్తులతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పూజా కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణదాస్, మంత్రి వేణు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 40 సంవత్సరాలు పైబడిన బస్తరు టేకును రథం నిర్మాణానికి వాడుతున్నామని ఈ సందర్భంగా దేవాదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ టీవీ9కు తెలిపారు. నూతన […]

శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథానికి అంకురార్పణ
Follow us on

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ క్రతువుకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఇవాళ ఉ.11:15 గంటలకు ఆలయ మర్యాదలు, భక్తిప్రపత్తులతో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పూజా కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి కృష్ణదాస్, మంత్రి వేణు, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 40 సంవత్సరాలు పైబడిన బస్తరు టేకును రథం నిర్మాణానికి వాడుతున్నామని ఈ సందర్భంగా దేవాదాయ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ టీవీ9కు తెలిపారు. నూతన రధం నిర్మాణ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ శాఖాపరంగా చేపట్టడం జరుగుతుందని.. మూడు నెలల్లో నాణ్యతా ప్రమాణాలతో రథం నిర్మాణం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు.

దగ్ధమైన పాత రథంకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ పూర్తయిందని తెలిపిన ఆయన.. రథం దగ్ధం కేసు విచారణ దశలో ఉందని.. విచారణ పూర్తయిన తర్వాత కారకులెవరో బయటపడతారని.. అప్పటివరకు ఘటనపై మాట్లాడలేమని పేర్కొన్నారు. కాగా, పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయశాఖ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగబోయే కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.