సెలెక్ట్ కమిటీ..నిజానిజాలు

ఆంధ్రప్రదేశ్‌లో పాపులరయ్యింది.. నేతల నోట బాగా వినిపిస్తోంది… అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి… ఇంతకీ సెలెక్ట్‌ కమిటీ ఉన్నట్టా..? లేనట్టా..? బిల్లులు ఆమోదం పొందాయా? లేదా? అన్న అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి.. కమిటీనే లేదంటోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌… పేర్లు పంపకుండా జగన్‌ సర్కార్‌ అడ్డుకుందని ఆరోపిస్తోంది తెలుగుదేశం… రాజధాని బిల్లులు శాసనమండలికి సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరనేది మాజీ స్పీకర్, టీడీపీ నేత యనమల రామకృష్ణుడి వాదన. ఎవరి వాదన కరెక్టన్నదానిపై ఇప్పుడు […]

సెలెక్ట్ కమిటీ..నిజానిజాలు
Follow us

|

Updated on: Feb 12, 2020 | 5:54 PM

ఆంధ్రప్రదేశ్‌లో పాపులరయ్యింది.. నేతల నోట బాగా వినిపిస్తోంది… అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి… ఇంతకీ సెలెక్ట్‌ కమిటీ ఉన్నట్టా..? లేనట్టా..? బిల్లులు ఆమోదం పొందాయా? లేదా? అన్న అనుమానాలు చాలామందికి కలుగుతున్నాయి.. కమిటీనే లేదంటోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌… పేర్లు పంపకుండా జగన్‌ సర్కార్‌ అడ్డుకుందని ఆరోపిస్తోంది తెలుగుదేశం… రాజధాని బిల్లులు శాసనమండలికి సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరనేది మాజీ స్పీకర్, టీడీపీ నేత యనమల రామకృష్ణుడి వాదన. ఎవరి వాదన కరెక్టన్నదానిపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది…

అసలేం జరిగింది…

మూడు రాజధానులకు సంబంధించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుతోపాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లును శాసనసభలో ఆమోదించి శాసనమండలికి పంపింది ప్రభుత్వం. శాసనమండలిలో ఆ బిల్లులు ఆమోదం పొందలేదు. తాను తప్పు చేస్తున్నానని చెబుతూనే తన విచక్షణాధికారానికి లోబడి ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్‌పర్సన్‌ షరీఫ్ ప్రకటించారు. గందరగోళాల మధ్య మండలిలో సరిగా మాట్లాడకుండానే సీటు నుంచి లేచి వెళ్లిపోయారు షరీఫ్‌. ఫలితంగా సభ నిరవధికంగా వాయిదా పడింది. ఆ తర్వాత తాను సెలెక్ట్ కమిటీ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్‌లు సెలెక్ట్ కమిటీకి తమ పార్టీ నుంచి పేర్లను పంపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం అసలు పేర్లను పంపలేదు. పైగా తమకు పేర్లను పంపాలని ఎవరూ కోరలేదని చెప్పింది… అసలు సెలెక్ట్ కమిటీ ప్రక్రియనే సరిగా లేదంటోంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి జగన్‌ కూడ దీనిపై ఆరా తీశారు. ఇటు అసెంబ్లీ కార్యదర్శి, అటు న్యాయనిపుణులతోను మాట్లాడారు. అదే సమయంలో శాసనమండలి రద్దు బిల్లును శాసససభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఆ ఫైల్‌ను కేంద్ర హోంశాఖకు పంపారు. పార్లమెంటు సమావేశాల్లో ఆ బిల్లును ప్రవేశ పెట్టి సాధారణ మెజార్టీతో పార్లమెంట్‌ ఆమోదిస్తే మండలి రద్దు అవుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్‌.టి.రామారావు ఇలాగే చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్దరించారు. ఇప్పుడు జగన్ సర్కార్ మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా మండలి రద్దు బాల్ కేంద్రం కోర్టుకు చేరింది.

టీడీపీ వాదనేంటి…

బిల్లులు శాసనమండలి సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా ఎవరూ ఆపలేరని చెబుతోంది టీడీపీ. అదే సమయంలో శాసనమండలి కార్యదర్శిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తున్నదని వాదిస్తోంది. మండలి ఛైర్‌పర్సన్‌ చెప్పింది కార్యదర్శి చేయాలని..అలా చేయకపోవడం ధిక్కారం కిందకు వస్తుందని చెబుతోంది. ఛైర్‌పర్సన్‌ ఆదేశాలను కార్యదర్శి తూచా తప్పకుండా పాటించాల్సిందే. లేదంటే సభా ధిక్కారం పరిధిలోకి వస్తారు. కార్యదర్శిని అరెస్టు చేయాలని మండలి ఆదేశిస్తే డీజీపీ పాటించాల్సిందే. లేకపోతే డీజీపీని కూడా మండలి ముందుకు పిలిపిస్తామని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. శాసనమండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. వైసీపీకి తగినంత బలం లేదు. కాబట్టి మెజారిటీ పక్షం అభిప్రాయం ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని మేం కోరామని, . పంపుతూ ఛైర్‌పర్సన్‌ నిర్ణయం తీసుకొన్నారని చెబుతోంది టీడీపీ. అసెంబ్లీలో అయినా, మండలిలో అయినా ఎవరికి మెజారిటీ ఉంటే వారిదే తుది నిర్ణయం. మండలితో ప్రభుత్వం ఘర్షణకు దిగితే వారికే నష్టమని టీడీపీ అంటోంది. అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లులను 14 రోజుల్లో తిప్పి పంపాలన్న నియమం ఉంది. అయితే ఇవి మనీ బిల్లులకే వర్తిస్తాయంటున్నారు న్యాయ నిపుణులు. ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ బిల్లులు మనీ బిల్లులు కావు. కాబట్టి సాధారణ బిల్లులకు నాలుగు నెలల సమయం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. బిల్లుల స్థానంలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని ప్రయత్నిస్తే గవర్నర్‌ సంతకం తప్పనిసరి. ఇందుకు గవర్నర్ సహకరిస్తారా లేరా అనేది ఉత్కంఠను పెంచుతోంది.

ఇవాళ కాకపోతే రేపైనా ఛైర్‌పర్సన్‌ ఆదేశాలను కార్యదర్శి పాటించాల్సిందే. అలా చేయక పోతే సభా హక్కుల ధిక్కారం అవుతుంది. అవసరాన్ని బట్టి ఆయనను తొలగించే అధికారం మండలి ఛైర్‌పర్సన్‌కు , లేదా గవర్నర్‌కు ఉంటుంది. సభాధిక్కారం రెండు రకాలుగా ఉంటుంది. దానిని సభా హక్కుల కమిటీకి పంపవచ్చు. లేదా నేరుగా మండలి తానే చర్చించి ఎలాంటి చర్య తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు.. .

వైసీపీ వాదనేంటి..?

కీలకమైన రెండు బిల్లులను శాసమండలికి పంపి 14 రోజులు గడిచాయి. సెలక్ట్‌ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై తదుపరి చర్యలను అసెంబ్లీ అధికారులు చూసుకుంటారని చెబుతోంది అధికార పార్టీ. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులకు ఆమోదించడం, తిరస్కరించడం లేదంటే పరిశీలన పేరుతో సెలెక్ట్‌ కమిటీకి పంపడం లాంటి మూడు ప్రత్యామ్నాయాలే ఉంటాయి. ఈనెల 22న బిల్లులను మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన పరిణామాలు నిబంధనల ప్రకారం జరగలేదని వైసీసీ చెబుతోంది. అందుకే ఆ బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపే పరిస్థితి లేదు. బిల్లులను మండలి తిరస్కరించలేదు. కాబట్టి మండలిలో బిల్లులు ఆమోదం పొందినట్టేనంటోంది. శాసనసభలో, మండలిలోనూ ఆమోదం పొందిన ఈ బిల్లులను తదుపరి చర్యగా గవర్నర్‌కు పంపే విషయాన్ని అసెంబ్లీ అధికారులు పరిశీలిస్తున్నారు. సెలెక్ట్‌ కమిటీ నియామకంపై ఏ ఒక్క నిబంధనను మండలి ఛైర్‌పర్సన్‌ అనుసరించలేదు. అసెంబ్లీలోని 5(9) (5) నిబంధన ప్రకారం ఏదైనా బిల్లు మండలిలో ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని అభ్యంతరం వ్యక్తం చేయాలి. ఈ రెండు బిల్లుల విషయంలో అది జరగలేదు. మండలి ఛైర్‌పర్సన్‌ నిర్ణయం వెలువరించే సమయంలోనూ తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు. ఛైర్‌పర్సన్‌ తన విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదని వాదిస్తోంది అధికార పార్టీ. అసెంబ్లీ కార్యదర్శి తమతో భేటీకి ముందే సెలక్ట్‌ కమిటీ అంశానికి సంబంధించిన ఫైల్‌ను తిప్పి పంపారని చెబుతోంది. ఇదే విషయమై ఇటు గవర్నర్, అటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.

శివనాగరాజు – టీవీ 9 సీనియర్  జర్నలిస్టు 

Latest Articles
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
దేశీ గడ్డపై Pushpa సాంగ్ ప్రకంపనలు | Hari Hara Veera Mallu రిలీజ్
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ అల్లరి ఈజ్ బ్యాక్ అనిపించాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
హిట్టా.? ఫట్టా.? సుహాస్ ప్రసన్న వదనం తో ఆకట్టుకున్నాడా.?
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్