SVBC Employees : పోర్న్ లింక్ వివాదంలో ఎస్వీబీసీ ఉద్యోగులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..టీటీడీ నిర్ణయానికి సమర్థన

|

Dec 31, 2020 | 5:54 PM

పోర్న్ వీడియో లింక్ వివాదంలో ఎస్వీబీసీ ఉద్యోగులకి హైకోర్టులో చుక్కెదురైంది. వివాదానికి బాధ్యులైన ఐదుగురు ఉద్యోగులను ఎస్వీబీసీ యాజమాన్యం విధుల నుంచి...

SVBC Employees : పోర్న్ లింక్ వివాదంలో ఎస్వీబీసీ ఉద్యోగులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..టీటీడీ నిర్ణయానికి సమర్థన
Follow us on

పోర్న్ వీడియో లింక్ వివాదంలో ఎస్వీబీసీ ఉద్యోగులకి హైకోర్టులో చుక్కెదురైంది. వివాదానికి బాధ్యులైన ఐదుగురు ఉద్యోగులను ఎస్వీబీసీ యాజమాన్యం విధుల నుంచి తొలగించిన విషయం విధితమే. అయితే తమకు నోటీస్ ఇవ్వకుండా తొలగించారంటూ ఉద్యోగులు హైకోర్టుని ఆశ్రయించగా.. ఉద్యోగులు వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల తిరుపతి దేవస్థాన్ని నిర్ణయాన్ని సమర్ధిస్తూ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది.

కొద్దిరోజుల క్రితం భక్తుడికి టీటీడీ ఉద్యోగి ఫోర్న్ లింక్ పంపడం తీవ్ర చర్చనీయాంశమైంది.  శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీ ఛానెల్‌కు ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలకు బదులుగా ఓ ఎస్వీబీసీ ఉద్యోగి పోర్న్ వెబ్‌సైట్ లింక్‌ను పంపించాడు. షాక్‌కు గురైన సదరు భక్తుడు దీనిపై టీటీడీ చైర్మన్, ఈవోకి సమాచారమిచ్చాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. టీటీడీ విజిలెన్స్ అధికారలుతో పాటు సైబర్ క్రైమ్ టీం, ఈడీపీ అధికారులు ఎస్వీబీసీ ఆఫీసులో సోదాలు చేశారు. పోర్న్ సైట్ వీడియో పంపిన ఉద్యోగితో పాటు ఆఫీసులో అశ్లీల వీడియోలు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించి వేటు వేశారు. విధులు నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తోన్న మరో 25 మంది సిబ్బందిని కూడా గుర్తించి వారిపై చర్యలకు టీటీడీ సిద్దమైంది.

Also Read : 

Reliance Jio : వినియోగదారులకు జియో న్యూ ఇయర్ గిఫ్ట్.. 2021 జనవరి 1 నుంచి అన్ని కాల్స్ ఉచితం

 Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..

Ap food processing policy : ఏపీలో నూతన ఆహారశుద్ధి విధానం అమల్లోకి.. రైతు భరోసా కేంద్రాలే ప్రాసెసింగ్ కేంద్రాలు !