బీటెక్ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. ఈ దెబ్బతో లైఫ్ సెటిల్డ్.. అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్న ప్రముఖ..

| Edited By: Team Veegam

Dec 04, 2020 | 3:25 PM

మీరు బీటెక్ చదువుతున్నారా అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే..చాలామంది బీటెక్ అయిపోగానే మంచి ఇంటర్న్‌షిప్ కోసం చూస్తారు.

బీటెక్ విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్.. ఈ దెబ్బతో లైఫ్ సెటిల్డ్.. అద్భుత అవకాశాన్ని కల్పిస్తున్న ప్రముఖ..
Follow us on

మీరు బీటెక్ చదువుతున్నారా అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే..చాలామంది బీటెక్ అయిపోగానే మంచి ఇంటర్న్‌షిప్ కోసం చూస్తారు. అలాంటి వారికి ఇది గుడ్ ‌న్యూసే. ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్, ప్రెష్ గ్రాడ్యుయేట్స్‌కి ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది. బీటెక్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు.

ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ లాంటి టెక్నికల్ బ్రాంచ్ బ్యాచిలర్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. అంతేకాకుండా ఒకటికన్నా ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే జావా, సీ ప్లస్ ప్లస్, పైథాన్ తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు కొనసాగుతోంది. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడానికి పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరితేది 11 డిసెంబర్ 2020గా చెప్పారు. ఇండియా మొత్తం మీద హైదరాబాద్, బెంగుళూర్‌లోని గూగుల్ క్యాంపస్‌లలో మాత్రమే ఈ ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంటుంది. విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా, వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

Read more:

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..