Ambani tension in YSRCP: వైసీపీలో కాకరేపిన అంబానీ.. ఎందుకంటే?

అంబానీ వస్తే వైసీపీ నేతలు కొందరికి టెన్షన్‌ పట్టుకుంది. అంబానీ తమ సీటు ఎక్కడికి పట్టుకుపోయారా? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీటు రిజర్వ్‌ అయిందని..ఇక కర్చీప్‌ వేద్దామనే లోపే ఆయన వచ్చారు.

Ambani tension in YSRCP: వైసీపీలో కాకరేపిన అంబానీ.. ఎందుకంటే?
Follow us

|

Updated on: Mar 03, 2020 | 5:30 PM

YS Jagan, Ambani meeting triggered tension in YSRCP leaders: అంబానీ వస్తే వైసీపీ నేతలు కొందరికి టెన్షన్‌ పట్టుకుంది. అంబానీ తమ సీటు ఎక్కడికి పట్టుకుపోయారా? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సీటు రిజర్వ్‌ అయిందని..ఇక కర్చీఫ్ వేద్దామనే లోపే ఆయన వచ్చారు. దీంతో ఇప్పుడు ఈక్వేషన్‌ మారుతున్నాయనే టెన్షన్ పట్టుకుంది.

ఈ పాటికే మ్యాటర్ అర్థమై వుంటుంది. ఎస్.. అధికార వైసీపీలో ఇపుడు రాజ్యసభ అంశం హాట్ హాట్‌గా వుంది. ఈ క్రమంలో సడన్‌గా ముఖేశ్ అంబానీ వచ్చారు… జగన్‌తో సుదీర్ఘంగా మంతనాలు సాగించారు. వారు వెళ్ళిపోయిన వెంటనే అంబానీ వచ్చింది రాష్ట్రం నుంచి ఓ రాజ్యసభ సీటు ఇమ్మని జగన్‌ను అడిగేందుకేనన్న ప్రచారం మొదలైంది. అదే వైసీపీ నేతల్లో టెన్షన్ కారణమైంది. ముఖేశ్ వెంట వచ్చిన పరిమళ్ నత్వానీ తమ మధ్య చర్చల్లో రాజ్యసభ సీటు అంశం కూడా ప్రస్తావనకు వచ్చిందని ప్రకటించడంతో వైసీపీ ఆశావహుల్లో టెన్షన్ మరింత పెరిగింది.

ముఖేష్ అంబానీ వచ్చి జగన్‌‌ని కలవడంతో వైసీపీలో కొందరి నేతల్లో అలజడి మొదలైంది. ప్రధానంగా రాజ్యసభ ఆశావహుల్లో ఆందోళన కనిపిస్తోంది. అంబానీ వెంట వచ్చిన పరిమళ్‌ నత్వానీకి ఏపీ కోటాలో టిక్కెట్ కేటాయించమని కోరేందుకే అంబానీ వచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరి ఆశలకు గండి పడుతుందో అన్న భయం కొందరు నేతల్లో పెరిగిపోతోంది.

వైసీపీకి నాలుగు సీట్లు దక్కబోతున్నాయి. ఇందులో ఒక సీటు పోతే మూడు సీట్లకు పోటీ తీవ్రమవుతుంది. దీంతో తమ ఛాన్స్‌ ఎక్కడ పోతుందో అని కొందరు ఆశవహులకు నిద్ర పట్టడం లేదట. ఇప్పటికే రాజ్యసభ రేసులో వ్యాపారవేత్త అయోధ్య రామిరెడ్డి, బీద మస్తాన్‌రావులతో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఉన్నారు. వీరిలో అయోధ్య రామిరెడ్డికి, బీదకు సీటు కన్‌‌ఫర్మ్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇక పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవిల్లో ఒకరిని రాజ్యసభకు పంపుతారని తెలుస్తోంది.

అయితే నాలుగో సీటుపై ఇంతకుముందు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక సీటుకు కోత పడడంతో…సమీకరణాలు మారతాయని ప్రచారం జరుగుతోంది. సినీ ఇండస్ట్రీ నుంచి ఇద్దరు నటులు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారని తెలుస్తోంది. మరి వీరిలో ఇప్పడు ఎవరినీ డ్రాప్‌ చేసి..మూడో వ్యక్తికి సీటు ఇస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే రాజకీయంగా తమకు మంచి మైలేజ్‌ వస్తుందని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇందులో భాగంగా వారు కోరిన వ్యక్తికి పదవి ఇచ్చేందుకు జగన్‌ రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇటు వైసీపీ నేతలు కూడా పెట్టుబడుల కోసం ఎంపీ సీటు త్యాగం చేయడం వల్ల నష్టం లేదని అంటున్నారు.

మొత్తానికి ఆ మూడు రాజ్యసభ సీట్లు ఎవరికి దక్కుతాయి అనే టెన్షన్‌ నేతల్లో పెరిగిపోతోంది. లాస్ట్‌ మినిట్‌లో సమీకరణాలు మారితే… తమ చాన్స్‌ పోతుందో అనే భయం ఉంది. దీంతో జగన్‌ ఏం నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠగా నేతలు ఎదురుచూస్తున్నారు.

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..