Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, చిక్కుకుపోయిన పేషెంట్స్‌.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది.

|

Mar 04, 2022 | 11:19 PM

Fire Accident: శ్రీనగర్‌ (Srinagar) బార్జుల్లాలోని బోన్‌ అండ్‌ జాయింట్‌ (Bone And Joint)ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు క్షణాల్లో  దావానంలా వ్యాపించడంతో...

Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, చిక్కుకుపోయిన పేషెంట్స్‌.. రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది.
Representative Image
Follow us on

Fire Accident: శ్రీనగర్‌ (Srinagar) బార్జుల్లాలోని బోన్‌ అండ్‌ జాయింట్‌ (Bone And Joint)ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం శుక్రవారం రాత్రి 9.30 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటలు క్షణాల్లో  దావానంలా వ్యాపించడంతో రోగులు మంటల్లో చిక్కుకుపోయారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆసుపత్రిలో ఉన్న రోగులను దగ్గరల్లోని జీవీసీ ఆసుపత్రికి తరలిస్తున్నారు.

బీ అండ్‌ జే ఆసుపత్రి మెడికల్‌ సూపరిండెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం ఎమర్జెన్సీ థియేటర్‌లో చెలరేగిన మంటలు శరవేగంగా ఆసుపత్రి మొత్తం వ్యాపించాయని పేర్కొన్నారు. మంటల్లో చిక్కుకున్న రోగులను యుద్ధప్రాతిపదికన జేవీసీ ఆసుపత్రికి తరలిస్తున్నామని వివరించారు. అగ్ని ప్రమాదంలో ఏ మేర నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

అగ్ని ప్రమాద దృశ్యాలు..

 

 

Also Read: Shane Warne Death: సచిన్ టెండూల్కర్‌ను చూస్తే భయమేసేది.. నా కలలో కూడా సిక్సర్లు కొట్టేవాడుః వార్న్

Shane Warne Records: క్రికెట్‌ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు షేన్‌ వార్న్‌ సొంతం

ఆర్టీసీ బస్సులో కీచక పర్వం.. ఒంటరిగా ఉన్న ప్రయాణికురాలిని.. డ్రైవర్ ఏం చేశాడంటే