శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డన్ సెర్చ్… ఏడుగురు అరెస్ట్!

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) లో బుధవారం నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. డిసిపి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలోని కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 100 మంది కానిస్టేబుళ్లు, ఐదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు సిఐలు, ఒక ఎసిపి పాల్గొన్నారు. వారు అంతర్జాతీయ టెర్మినల్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో శోధన కార్యకలాపాలు నిర్వహించి, అన్ని వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు. ఈ […]

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కార్డన్ సెర్చ్... ఏడుగురు అరెస్ట్!
Follow us

| Edited By:

Updated on: Nov 13, 2019 | 4:14 PM

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) లో బుధవారం నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో ఏడుగురిని అరెస్ట్ చేశారు. డిసిపి ప్రకాష్ రెడ్డి నేతృత్వంలోని కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 100 మంది కానిస్టేబుళ్లు, ఐదుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు సిఐలు, ఒక ఎసిపి పాల్గొన్నారు. వారు అంతర్జాతీయ టెర్మినల్ ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో శోధన కార్యకలాపాలు నిర్వహించి, అన్ని వాహనాలకు సంబంధించిన పత్రాలను తనిఖీ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేసి ఆరు టాక్సీలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన 16 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో పర్మిట్ లేని కార్లు తిరగడం.. డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ప్రయాణీకులను వేధిస్తున్నారని ఫిర్యాదులు అందిన తరువాతే.. ఈ ఆపరేషన్ జరిగినట్లు తెలుస్తోంది.