టాప్ 10 న్యూస్ @ 6 PM

|

Aug 23, 2019 | 6:49 PM

గజదొంగ ఇంట్లోనే దొంగతనం జరిగిందా..!: అంబటి ఎద్దేవా కోడెలనే పెద్ద గజదొంగ అని.. ఆయన ఇంట్లోనే దొంగతనం జరిగిందా..? అంటూ కోడెలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే చిన్న దొంగతనం అనే నాటకం ఆడారని ఆయన ఆరోపించారు..Read More  ఇకపై తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే! ఈ మధ్యకాలంలో ప్రతీ డాక్యుమెంట్‌కు ఆధార్ తప్పనిసరని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మనం ఇచ్చిన అధికారిక డాక్యూమెంట్లలో మాత్రం […]

టాప్ 10 న్యూస్ @ 6 PM
Today top News - TV9
Follow us on

గజదొంగ ఇంట్లోనే దొంగతనం జరిగిందా..!: అంబటి ఎద్దేవా

కోడెలనే పెద్ద గజదొంగ అని.. ఆయన ఇంట్లోనే దొంగతనం జరిగిందా..? అంటూ కోడెలపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. పెద్ద దొంగతనాన్ని కప్పిపుచ్చుకునేందుకే చిన్న దొంగతనం అనే నాటకం ఆడారని ఆయన ఆరోపించారు..Read More 

ఇకపై తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లించాల్సిందే!

ఈ మధ్యకాలంలో ప్రతీ డాక్యుమెంట్‌కు ఆధార్ తప్పనిసరని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే మనం ఇచ్చిన అధికారిక డాక్యూమెంట్లలో మాత్రం తప్పుడు ఆధార్ ఇస్తే.. భారీ మూల్యం చెల్లిచుకోవాల్సి వస్తుంది. ఇక ఆ జరిమానా 100 లేదా 500 కాదు.. ఏకంగా రూ.10,000 రూపాయలు..Read More

అమరావతిపై జగన్ ‘విదేశీ’ నిర్ణయం?

ఏపీ రాజధాని అమరావతిపై బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అటు ఏపీకి కొత్త రాజధానిగా దొనకొండను చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది…Read More

తిరుమల అన్యమత ప్రచారంపై మండిపడ్డ రాజా సింగ్

పవిత్ర పుణ్యక్షేత్రం.. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ఇతర మతాలకు చెందిన ప్రకటనలు కనిపించడంతో భక్తులు ఖంగుతిన్నారు..Read More

ఫోక్స్ వ్యాగన్ కేసులో బోత్సాకు సమన్లు

ఫోక్స్ వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయనకు హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు జారీ చేస్తూ… సెప్టెంబర్ 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది..Read More

పిల్లలకు ఉప్పుతోనే మధ్యాహ్న భోజనం

పేద పిల్లలను బడి బాట పట్టించడం కోసం మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాయి ప్రభుత్వాలు. దీంతో ఓ పూటైనా పిల్లల కడుపు నిండుతుందనే ఉద్ధేశ్యంతో తమ పిల్లలను సర్కారీ బడులకు పంపుతున్నారు తల్లిదండ్రులు..Read More

Gold Rates Today: బంగారం ధరలు పరుగులు..గోల్డ్ అంటే గుభేలే!

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  తులం బంగారం ధర త్వరలోనే రూ.52 వేలుకి చేరడం ఖాయమని బులియన్ నిపుణులు అంచనా వేస్తున్నారు..Read More

అమితాబే కాళ్లు మొక్కాడంటే..ఆవిడ వ్యక్తిత్వం ఎంత గొప్పదో

బాలీవుడ్ బిగ్ బీ..అమితాబ్ యాక్టింగ్ గురించి, ఆయన స్థాయి గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉండదు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండియాకు ఒకే ఒక్క మెగాస్టార్.. ఆయన అమితాబ్ అంటూ ఇటీవలే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే...Read More

కౌశల్య కృష్ణమూర్తి మూవీ రివ్యూ

రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. తాజాగా మరో తమిళ రీమేక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు…Read More

అక్కడ ఉన్నదేగా ఇక్కడ..సెన్సార్ కత్తెరపై కాజల్ అసహనం

టాలీవుడ్ చందమామకు కోలీవుడ్ సెన్సార్‌ బోర్డుపై కోపం వచ్చింది. ఎంతో కష్టపడి తీస్తే ఇన్ని కట్‌లు ఏంటంటూ ఆమె ఫైర్ అవుతోంది. ఇలా కత్తిరించడం నాకేం నచ్చడం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది…Read More