Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

Kousalya Krishnamurthy Review, ‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

టైటిల్ : ‘కౌసల్య కృష్ణమూర్తి’

తారాగణం : ఐశ్వర్య రాజేశ్‌, రాజేంద్రప్రసాద్‌, శివకార్తికేయన్‌, ఝాన్సీ, వెన్నెల కిషోర్‌, శశాంక్‌, రవిప్రకాశ్‌ తదితరులు

సంగీతం : దిబు నిన్నాన్‌ థామస్‌

నిర్మాతలు : కేఎ వల్లభ

కథ : అరుణ్‌రాజా కామరాజ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : భీమినేని శ్రీనివాసరావు

విడుదల తేదీ: 23-08-2019

రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్టైన దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. తాజాగా మరో తమిళ రీమేక్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కనా’ సినిమాను ‘కౌసల్య కృష్ణమూర్తి పేరుతో రూపొందించాడు. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ ‘కనా’ను కౌస‌ల్య గుర్తుకు తెచ్చిందా?  లేదా అనేది ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

రైతు కృష్ణ‌మూర్తి (రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కి వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో.. క్రికెట్ అన్నా కూడా అంతే ఇష్టం. టీమిండియా మ్యాచ్ ఓడిపోతే అసలు తట్టుకోలేడు. సరిగ్గా తండ్రి మాదిరిగానే చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకుంటుంది కౌసల్య(ఐశ్వ‌ర్య రాజేష్‌). ఇండియా త‌ర‌పున ఆడి, క‌ప్పు గెలిచి తండ్రి క‌ళ్ల‌లో ఆనందం చూడాల‌నుకుంటుంది. అయితే వాళ్ళ అమ్మ (ఝాన్సీ) మాత్రం మ‌గ‌పిల్ల‌ల‌తో ఆట‌లేంటి? ఊళ్ళో వాళ్ళు సూటిపోటి మాటలు అంటారు.. తమ పరువు పోతుందంటూ కఠువుగా మాట్లాడుతుంది. ఎవరెన్ని మాటలు అన్నా.. కౌసల్య క్రికెటర్ కావడానికి సన్నధం అవుతుంది. మ‌రి ఆమె తను అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించిందా, లేదా? త‌న తండ్రి ఆనందం కోసం త‌న ల‌క్ష్యం కోసం కౌస‌ల్య ఎన్నికష్టాలు ప‌డింది? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి మాట్లాడితే.. క్రికెటర్ పాత్ర కోసం ఆమె పడిన కష్టం వెండితెరపై కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో చాలా ఈజ్‌తో నటించింది. రాజేంద్ర ప్ర‌సాద్ పాత్ర విధానం.. అందులో రాజేంద్రుడి నటన అద్భుతంగా ఉంది. ఝాన్సీ మరోసారి ఆమె పాత్రలో ఒదిగిపోయింది. ఇక చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన హీరో శివ కార్తికేయ‌న్ నటన.. ఆ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

విశ్లేష‌ణ‌ :

ఒరిజినల్ వెర్షన్‌లో ఉన్న ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌ను ఏమాత్రం మిస్ చేయకుండా రీమేక్‌ను తెరకెక్కించారు. ఇక క్రికెట్‌ చుట్టూ కీలకమైన కథను దర్శకుడు మిక్స్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఓ అమ్మాయి క్రికెట‌ర్‌గా ఎదిగే తీరు, ఓ రైతు ప‌త‌నం.. ఇవి రెండూ ఒకే క‌థ‌లో ఇమిడ్చి, చివ‌ర్లో రైతుల్ని బ‌తికించండి, రైతుల్ని అప్పుల పాలు చేయొద్దు అంటూ మెసేజ్ ఇచ్చిన తీరు సగటు ప్రేక్షకుడికి నచ్చుతుంది. రైతు హత్యలు, క్రీడా నేపధ్యం మేళవించి చెప్పడం బాగుంది.

సాంకేతిక విభాగాల పనితీరు:

ఓవరాల్‌గా సినిమా బాగుంది. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నచ్చుతాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • క‌థ‌, క‌థ‌నం
  • శివ‌ కార్తికేయ‌న్‌
  •  తండ్రీ కూతుళ్ల ఎమోష‌న్‌

మైనస్‌ పాయింట్స్‌ :

  • తమిళ ఫ్లేవర్

Related Tags