ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిసెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ ప్రకటనలో తెలిపారు.

  • Rajeev Rayala
  • Publish Date - 8:33 pm, Mon, 30 November 20
ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. డిసెంబర్ 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలోని ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం న‌వంబ‌ర్ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1 ఉదయం 8 గంటల నుంచి 7 వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైటు www .knruhs.telangana.gov.in ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.