వివేకా హ‌త్య కేసులో కీల‌క అప్ డేట్…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్ప‌టికే ఈ కేసులో వివేకా ఇంటి వాచ్ మెన్, ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ, డ్రైవ‌ర్ ప్ర‌సాద్ స‌హా ప‌లువురుని ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు.. కీల‌క స‌మాచారం సేక‌రించారు.

వివేకా హ‌త్య కేసులో కీల‌క అప్ డేట్...
Follow us

|

Updated on: Jul 26, 2020 | 9:05 PM

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసు విచార‌ణ‌లో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్ప‌టికే ఈ కేసులో వివేకా ఇంటి వాచ్ మెన్, ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ, డ్రైవ‌ర్ ప్ర‌సాద్ స‌హా ప‌లువురుని ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు.. కీల‌క స‌మాచారం సేక‌రించారు. తాజాగా గ‌తంలో సిట్ చేసిన‌ ద‌ర్యాప్తు నివేదిక‌ల‌ను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 సిట్ టీమ్స్ దర్యాప్తు చేసిన నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆఫిస‌ర్స్… రేపట్నుంచి అనుమానితులను అధికారికంగా విచారించనున్నారు. సీబీఐ విచారణ అధికారి నేతృత్వంలో కడపలోనే అనుమానితులను విచారించే ఛాన్స్ ఉంది.

హైకోర్టు ఆదేశంతో వివేకా హ‌త్య కేసు సీబీఐ చేతికి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. కీలక సూత్రధారులపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ అధికారులు దృష్టి సారించారు. ఇప్ప‌టికే సిట్, సీబీఐ బృందాల మ‌ధ్య కీల‌క స‌మాచార మార్పిడి జ‌రిగింది. మ‌రోవైపు క‌డ‌ప‌లోని వివేకా నివాసంలో సీబీఐ అధికారులు సీన్ సీన్​ రీకన్​స్ట్రక్షన్ చేశారు. టెక్నిక‌ల్ టీమ్ ను రంగంలోకి దింపి స‌మాచారం సేకరించారు.