ఇంగ్లాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ తో సహా చాలా మ్యాచులు, ఈవెంట్లు రద్దయ్యాయి. కాగా.. వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టుకు

ఇంగ్లాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌!
Follow us

| Edited By:

Updated on: Jun 30, 2020 | 2:38 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ తో సహా చాలా మ్యాచులు, ఈవెంట్లు రద్దయ్యాయి. కాగా.. వెస్టిండీస్‌తో ఆరంభమయ్యే తొలి టెస్టుకు ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ జో రూట్‌ దూరం కానున్నాడు. తన భార్య ప్రసవించే అవకాశం ఉండటంతో రూట్‌ జట్టును వీడనున్నాడు. రూట్‌ స్థానంలో సీనియర్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ తొలిసారి తాత్కాలికంగా జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. రూట్‌ రెండో టెస్టుకు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యూరప్ లో కరోనా కేసులు ఎక్కువగా ఆమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిద్-19 రూల్స్ ప్రకారం జో రూట్ తన భార్య దగ్గరకు వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ జట్టుతో కలిసే ముందు ఏడు రోజుల పాటు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాల్సి ఉంటుంది. బయో సెక్యూర్‌ వాతావరణంలో టెస్టు సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన క్రికెట్‌ మూడు నెలల విరామం అనంతరం మళ్లీ మొదలవబోతున్నది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టు సౌతాంప్టన్‌ వేదికగా జూలై 8న ప్రారంభంకానుంది.

Also Read: ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!