చిన్నారి జషీత్ కిడ్నాప్ పై వీడని మిస్టరీ..!

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల జషిత్‌ కిడ్నాప్‌కు గురై 24 గంటలు గడిచింది. అయినా బాలుడీ ఆచూకీ లభించలేదు. ఎలా ఉన్నాడో.. ఎక్కడ వున్నాడో తెలియదు..? అమ్మఒడిలో ఆడుకోవాల్సిన బాలుడు కిడ్నాపర్ల చెరలో బందీ అయ్యాడన్న ఆందోళన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మిస్టరీగా మారిన కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి.. జషిత్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే కిడ్నాపర్ల ఆచూకీ పూర్తిగా లభించకపోయినా.. […]

చిన్నారి జషీత్ కిడ్నాప్ పై వీడని మిస్టరీ..!
Follow us

| Edited By:

Updated on: Jul 24, 2019 | 11:26 AM

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాలుగేళ్ల జషిత్‌ కిడ్నాప్‌కు గురై 24 గంటలు గడిచింది. అయినా బాలుడీ ఆచూకీ లభించలేదు. ఎలా ఉన్నాడో.. ఎక్కడ వున్నాడో తెలియదు..? అమ్మఒడిలో ఆడుకోవాల్సిన బాలుడు కిడ్నాపర్ల చెరలో బందీ అయ్యాడన్న ఆందోళన తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మిస్టరీగా మారిన కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి.. జషిత్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే కిడ్నాపర్ల ఆచూకీ పూర్తిగా లభించకపోయినా.. రెండు మూడు క్లూస్ దొరికాయని జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అష్మీ తెలిపారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టామని చెప్పారు. త్వరలోనే బాబును క్షేమంగా కిడ్నాపర్ల నుంచి విడిపిస్తామని భరోసా ఇచ్చారు. జషిత్ ఆచూకీ కనుగొనేందుకు జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద అప్రమత్తం చేశారు పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. క్లూస్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. కాగా జషిత్ తల్లిదండ్రులు ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు. డబ్బుకోసం గాని, మరే ఇతర కారణాలు ఉన్నాయా అంటే.. కిడ్నాపర్ల నుంచి ఇప్పటివరకు ఎలాంటి కాల్ రాలేదు. బాలుడి తల్లి కన్నీరుమున్నీరవుతోంది. జషీత్ క్షేమంగా తిరిగి రావాలని కుటుంబసభ్యులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Latest Articles