హీరోయిజం కాదు.. వీరోచితం చూపా – రాపాక

జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం పోలీస్ స్టేషన్‌పై దాడికి యత్నించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాపాక పీఎస్‌లో లొంగిపోయారు. ఆయనను తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులలో కోర్టులో హాజరు పరచగా.. కేసు తమ పరిధిలోకి రాదని స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆదేశించడంతో పోలీసులు ఆయనకు స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేసి విడుదల చేశారు. ఇక విడుదలైన రాపాక మలికిపురం ఎస్సైపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

హీరోయిజం చూపించడానికి  మలికిపురం ఎస్సై తనను తిట్టాడని.. చిన్న విషయాన్ని వారు పెద్దదిగా చేసి చూపిస్తున్నారని రాపాక తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎస్సై తనను పాయింట్ బ్లాంక్‌లో పెట్టి షూట్ చేసి పారేస్తానని స్టేషన్‌లో వీరంగం చేశారని జనసేన ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీస్ స్టేషన్ అద్దాలను ఎవరో అరాచక శక్తులు ధ్వంసం చేశారని.. తనకు, తమ పార్టీ కార్యకర్తలకు దానితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మలికిపురం ఎస్సైపై రాపాక వ్యక్తిగతంగా కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *