వర్షాలకోసం పూజలు ఇలాగా ? నవ్వి పోతారు !

అనావృష్టితో సతమతమవుతున్న దేశంలో వర్షాలు పడాలంటే వరుణుడిని ప్రసన్నం చేసుకోవడానికి కప్పల పెళ్లిళ్లు చేస్తారు. అలా చేస్తే సమృద్దిగా వానలు పడతాయని చాలామంది ప్రజల నమ్మకం. అయితే వర్షాల కోసం వెరైటీ పూజలు జరిపారు కర్ణాటక లోని పూజారులు. వీళ్ళు నీళ్లు నింపిన పెద్ద పాత్రల్లో కూర్చుని..చేతిలో సెల్ ఫోన్లు పట్టుకుని మంత్రాలు చదివిన తతంగం నవ్వులపాలై.. ‘ కెవ్వు ‘ మనిపిస్తోంది. ఇద్దరు పూజారులు చేసిన ఈ వైనం తాలూకు ఫోటోలు నెట్ లో హల్చల్ చేస్తుండగా.. ఇది చూసి ట్రోలర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నెల 7 న బెంగుళూరులోని సోమేశ్వరాలయంలో జరిగిన ఈ ‘ పూజా ప్రహసనం ‘ పై నెటిజన్ల జోకులే జోకులు ! ఓ పూజారి హోమం చేస్తుంటే..వీరిద్దరూ మాత్రం ఇలా కెమెరా కంటికి చిక్కారు.ఓ పాత్రలోని పురోహితుడు నవ్వీ నవ్వనట్టు నవ్వుతూ పోజిచ్చాడు. ఈ పూజారులు తమ ఫోన్ల ద్వారా ‘ వరుణుడికి ఏమైందో స్వర్గంలోని ఇంద్రుడ్ని కాంటాక్ట్ చేస్తున్నారా ‘ అని కొందరు సెటైర్లు వేస్తే.. అసలు వీళ్ళు మంత్రాలు చదువుతున్నారా లేక ఫోన్లు పట్టుకుని ఈ పాత్రల్లో ‘ సెమీ-బాత్ ‘ చేస్తున్నారా అని మరికొంతమంది ట్రోల్ చేశారు. ఇంకా ఇలాగే పలువురు వెరైటీగా స్పందించారు. అన్నట్టు…ఇక్కడ ట్రోల్ అంటే..ఈ ‘ సీన్ ‘ ని బట్టి ఎలా అయినా అన్వయించుకోవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *